వేరవదార్ బ్లాకు బాక్ జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేరవదార్ బ్లాకు బాక్ జాతీయ ఉద్యానవనం
A blackbuck stag at the grasslands of the national park
Map showing the location of వేరవదార్ బ్లాకు బాక్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of వేరవదార్ బ్లాకు బాక్ జాతీయ ఉద్యానవనం
ప్రదేశంభావ నగర్ జిల్లా, గుజరాత్, భారతదేశం
విస్తీర్ణం34.08 కి.మీ2 (13.16 చ. మై.)
స్థాపితం1976
పాలకమండలిForest Department of Gujarat

వేరవదార్ బ్లాకు బాక్ జాతీయ ఉద్యానవనం గుజరాత్ రాష్ట్రంలోని భావ నగర్ ప్రాంతంలో ఉంది. ఇది బ్లాకు బాక్ (కొమ్ముల జింకలు) లకు ప్రధాన ఆకర్షణ.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనాన్ని 1976 లో స్థాపించారు.[2] ఇది 34.08 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. పూర్వకాలంలో భావ నగర్ మహారాజు ఈ ప్రదేశాన్ని బ్లాకు బాక్ వేట కు ఉపయోగించేవాడు.

జంతు సంపద

[మార్చు]

ఈ ఉద్యానవనం బ్లాక్ బక్స్, తోడేళ్ళు, మాక్వీన్స్ బస్టర్డ్స్, హైనాస్, నక్కలు, కుందేళ్లు, అడవి పిల్లులు ఉన్నాయి. బ్రిటీష్ హారియర్ నిపుణుడు రోజర్ జాఫ్రీ క్లార్క్ ప్రకారం ఈ ఉద్యానవనంలో కనిపించే హారియర్ రూస్ట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్పాడు.

మరిన్ని విశేషాలు

[మార్చు]

మొదట ఈ ఉద్యనవనాన్ని 18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. కానీ, 1980 లో మరో 16 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్నికి పెంచి మొత్తం ఉద్యానవనాన్ని 34.08 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి విస్తరించారు. ఈ ఉద్యానవనం వర్షాకాలంలో బ్లాక్ బాక్ లకు మరికొన్ని జంతుజాతులకు సంతానోత్పత్తి కారణంగా జూన్ 15 నుండి అక్టోబర్ 15 వరకు మూసివేయబడింది. ఇది సందర్శకుల సందర్శన కోసం అక్టోబర్ చివరి వారం నుండి మార్చి చివరి వారం వరకు అనుమతినిస్తారు. ఈ ఉద్యానవనంలో డిసెంబర్ నుండి మార్చి వరకు అనేక జాతుల వలస పక్షులు, మూడు జాతుల హారియర్లు, ఈగల్స్, వాడర్స్ వంటి పక్షి జాతులకు చెందిన పక్షులు వలస వస్తాయి. ఇక్కడ ముందస్తు బుకింగ్ ద్వారా బస ఏర్పాటు చేసుకోవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. Blackbuck National Park
  2. వేరవదార్ బ్లాకు బాక్ నేషనల్ పార్క్. "వేరవదార్ బ్లాకు బాక్ నేషనల్ పార్క్". telugu.nativeplanet.com. Archived from the original on 17 ఏప్రిల్ 2016. Retrieved 3 October 2019.