వేరీజ్ ద ఫ్రెండ్స్ హోం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేరీజ్ ద ఫ్రెండ్స్ హోం
Where Is the Friends Home.jpg
వేరీజ్ ద ఫ్రెండ్స్ హోం సినిమా పోస్టర్
దర్శకత్వంఅబ్బాస్ కియరోస్తమి
నిర్మాతఅలీ రెజా జార్రిన్
రచనఅబ్బాస్ కియరోస్తమి
నటులుబాబెక్ అహ్మద్పూర్, అహ్మద్ అహ్మద్పూర్
సంగీతంఅమీన్ అల్లా హెస్సిన్
ఛాయాగ్రహణంఫర్హాద్ సబా
కూర్పుఅబ్బాస్ కియరోస్తమి
విడుదల
ఫిబ్రవరి 1987 (1987-02)
నిడివి
83 నిముషాలు
దేశంఇరాన్
భాషపర్షియన్

వేరీజ్ ద ఫ్రెండ్స్ హోం 1987లో విడుదలైన ఇరాన్ చలనచిత్రం. అబ్బాస్ కియరోస్తమి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబెక్ అహ్మద్పూర్, అహ్మద్ అహ్మద్పూర్ నటించారు.[1]

కథ[మార్చు]

సినిమా కథ అంతా ఎనిమిదేళ్ళ కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. ఎనిమిదేళ్ళ అహ్మద్ క్లాసులో పక్కనున్న మరో అబ్బాయి హోం వర్క్ చేయలేదని మాస్టారు కోప్పడతాడు. మరుసటిరోజు హోం వర్క్ చేయకపోతే క్లాసుకి రానివ్వను అంటాడు. అహ్మద్ ఇదంతా చూస్తాడు. స్కూల్ అయ్యాక ఇంటికి వచ్చిన అహ్మద్, తన పుస్తకాలతోపాటు ఆ అబ్బాయి నోట్ బుక్ కూడా తన బ్యాగ్ లో ఉండడం గమనిస్తాడు. ఆ నోట్ బుక్ లో హోం వర్క్ చెయ్యకపోతే టీచర్ ఆ అబ్బాయిని రేపు స్కూలుకి రానివ్వడు కాబట్టి, ఎలాగైనా అతడి ఇంటికి వెళ్ళి ఆ నోట్ బుక్ ఇచ్చెయ్యాలనుకుంటాడు. ఎక్కడో దూరాన కొండ అవతల ఉన్న ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళకుండా అహ్మద్ తల్లి కోప్పడుతుంది. కాబట్టి తన తల్లి చూడకుండా బయటకు వచ్చి తన క్లాస్ మేట్ కి ఆ పుస్తకం ఇచ్చేయ్యాలని బయలుదేరాడు. అలా వెళ్ళిన అహ్మద్ కు ఊరు వెళ్ళి ఆ అబ్బాయి ఇంటిని వెదికేక్రమంలో ఎదురైన రకరకాల మనుషులూ, సన్నివేశాలూ, ఎంత వెదికినా అతని ఇల్లు దొరక్కపోవడం, ఇంతలో చీకటి పడడం జరుగుతుంది. చివరికి అతని ప్రయత్నం ఏమైంది, మరుసటిరోజు ఆ క్లాసు రూములో ఏం జరిగింది అనేది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

 • బాబెక్ అహ్మద్పూర్
 • అహ్మద్ అహ్మద్పూర్
 • ఖేడా బరేచ్ డెఫాయి
 • ఇరాన్ ఔరిరి
 • అయాత్ అన్సారీ
 • సాడికా తోహీడి
 • బిమాన్ మోయుఫీ
 • అలీ జమాలీ
 • అజీజ్ బాబాయి
 • నాదెర్ ఘోలమి
 • అక్బర్ మొరాది
 • టెబా సోలిమాని
 • మొహమ్మద్ రెజా పర్వనేహ
 • ఫరాహంకా బ్రదర్స్
 • మరియా చిడ్జరి
 • హామ్డొలా అస్సార్పౌర్
 • కాడిరెట్ కాయోయెన్పౌర్
 • హజార్ ఫారజ్పౌర్
 • మొహమ్మద్ హోస్సీన్ రూహీ
 • రాఫియా డిఫాయి
 • అగాఖన్ కరాడచ్ ఖని

సాంకేతికవర్గం[మార్చు]

 • రచన, దర్శకత్వం: అబ్బాస్ కియరోస్తమి
 • నిర్మాత: అలీ రెజా జార్రిన్
 • సంగీతం: అమీన్ అల్లా హెస్సిన్
 • ఛాయాగ్రహణం: ఫర్హాద్ సబా
 • కూర్పు: అబ్బాస్ కియరోస్తమి

చలన చిత్రోత్సవాలు[మార్చు]

ఈ చిత్రం 1989లో జరిగిన లొకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్రౌన్జ్ లియోపార్డ్ (కాంస్య చిరుత) అవార్డును గెలుచుకుంది.[2] అంతేకాకుండా ఫజ్ర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గోల్డెన్ ప్లేట్ బహుమతిని గెలుచుకుంది.

మూలాలు[మార్చు]

 1. Mike Lorefice (2006). "Where Is the Friend's Home, Iran - 1987". metalasylum.com. Retrieved 27 November 2018. Cite web requires |website= (help)
 2. "Where is the Friend's Home?". Toronto International Film Festival. Retrieved 27 November 2018.

ఇతర లంకెలు[మార్చు]