శ్వేత సౌధం

వికీపీడియా నుండి
(వైట్ హౌజ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్వేత సౌధం

శ్వేత సౌధం (English: White House వైట్ హౌస్) అమెరికా అధ్యక్షుని నివాసం. వాషింగ్‌టన్‌ డీసీలో ఉంది. దీన్ని నిర్మించి ఇప్పటికి 210 ఏళ్లయింది. ఇన్నేళ్ల చరిత్రలోనూ ఇదొకసారి శత్రు సైనికుల దాడికి ధ్వంసమైంది. అగ్నిప్రమాదం, వరదలు ఎదుర్కొంది. దీని నిర్వహణకు ఏటా అయ్యే ఖర్చు సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు.

ప్రస్తుతం వైట్‌హౌస్‌ అని వ్యవహరించబడుతున్నప్పటికీ, దాన్ని కట్టాక వందేళ్లకి కానీ ఆ పేరు ఏర్పడలేదు. అంతకు ముందు ప్రెసిడెంట్స్‌ ప్యాలస్‌ అని, ఎగ్జిక్యూటివ్‌ మాన్షన్‌ అనిరకరకాలుగా వ్యవహరించేవారు. ఓసారి ఇది కాలిపోయినప్పుడు మరమ్మతుల కోసం తెల్లరంగు వేశారు. అప్పట్నుంచి వైట్‌హౌస్‌ అనేవారు. అధికారికంగా మాత్రం 1901లో అప్పటి అధ్యక్షుడు థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ ఆ పేరును వాడడం మొదలుపెట్టారు.

ఆరు అంతస్తులుగల ఈ భవనం ఉన్న స్థలం కంచెతో కలిపి మొత్తం 18 ఎకరాలు. భవనం లోపల నిర్మాణస్థలం 55,000 చదరపు అడుగులు. ఉగ్రవాదుల భయంతో ఇప్పుడు అనుమతించడం లేదు. అంతకు మునుపు రోజూ దీన్నీ చూడ్డానికి ఆరువేల మంది వచ్చేవారు.

వైట్‌హౌస్‌ నిర్మాణాన్ని 1792లో మొదలు పెట్టి ఎనిమిదేళ్ల పాటు కొనసాగించారు. అమెరికా తొలి అధ్యక్షుడైన జార్జి వాషింగ్టన్ ఎంపిక చేసిన స్థలంలో కట్టడం మొదలుపెడితే రెండో అధ్యక్షుడైన జాన్‌ ఆడమ్స్‌ హయాంలో 1800లో పూర్తయింది. దీని నిర్మాణానికి అప్పట్లో సుమారు 13 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. తర్వాత ఒకో అధ్యక్షుడుఒకో రకమైన మార్పులు చేస్తూ వచ్చారు. ఇప్పటి అధ్యక్షుడు ఒబామా కొత్తగా ఆర్గానిక్‌ తోటని నాటించి, అందులో తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు.

విశేషాలు

[మార్చు]
  • యుద్ధ సమయంలో 1814లో బ్రిటిష్‌ సైనికులు దీన్ని తగుల బెట్టారు.
  • వైట్‌హౌస్‌లో కూడా ఎలుకల బెడద కూడా ఉండేది. జంతు ప్రేమికుడైన అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ వాటిని పెంచేవాడు. వాటి సంఖ్య పెరిగిపోవడంతోఫెర్రెట్స్‌ అనే ముంగిసలాంటి జంతువుల్ని పెంచి అరికట్టాల్సి వచ్చింది.
  • వైట్‌హౌస్‌ భూగర్భంలో ఓ బంకర్‌ ఉంది. అత్యవరసర పరిస్థితుల్లోఅధ్యక్షుడు ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించడానికి అత్యాధునిక సౌకర్యాలుఉన్నాయి. కొన్ని సొరంగమార్గాలు కూడా ఉన్నాయి.
  • వైట్‌హౌస్‌లో మొత్తం 132 గదులు, 142 తలుపులు, 147 కిటికీలు, ఒకేసారి140 మంది కూర్చుని తినగలిగే డైనింగ్‌ టేబుల్‌, 13,000 చాకులు, చెంచాలు ఉన్నాయి.
  • దీని నిర్వహణకు 5,700 మంది ఉద్యోగులున్నారు.

వైట్ హౌస్ అద్దె

[మార్చు]

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ అద్దె విలువ నెలకు సుమారు రూ.110 కోట్లు అని అంచనా. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒకవేళ అద్దె చెల్లించాల్సిన పరిస్థితే వస్తే, ఆరు నెలలకు మించి ఆయన దానిని భరించే పరిస్థితి లేదంటూ ‘న్యూయార్క్ డెయిలీ’ దినపత్రిక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం... సువిశాలమైన వైట్‌హౌస్ విస్తీర్ణం 55 వేల చదరపు అడుగులు కాగా, ఇందులో 132 గదులు ఉన్నాయి. 2013 ఆగస్టు ధరల ప్రకారం దీని అద్దె విలువ నెలకు రూ.110 కోట్లకు (18 లక్షల డాలర్లు) పైమాటే. ఇంతటి విస్తీర్ణంలో నిర్మించిన భవనానికి ఏటా రూ.66.75 లక్షలు (1.09 లక్షల డాలర్లు) పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నికర విలువ రూ.74.7 కోట్లు (12.2 లక్షల డాలర్లు) మాత్రమే. ఆయన వార్షికాదాయం రూ.24.4 కోట్లు (4 లక్షల డాలర్లు).

మూలాలు

[మార్చు]