వైఫ్ ఐ
స్వరూపం
వైఫ్ ఐ | |
---|---|
దర్శకత్వం | జీఎస్ఎస్‌పీ కళ్యాణ్ |
స్క్రీన్ ప్లే | జీఎస్ఎస్‌పీ కళ్యాణ్ |
కథ | జీఎస్ఎస్‌పీ కళ్యాణ్ |
నిర్మాత | జి.చరితారెడ్డి |
తారాగణం | అభిషేక్ రెడ్డి, గుంజన్ |
ఛాయాగ్రహణం | జీఎస్ఎస్‌పీ కళ్యాణ్ |
సంగీతం | వినోద్ యాజమాన్య |
నిర్మాణ సంస్థలు | లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్‌పీకే స్టూడియోస్ |
విడుదల తేదీ | జనవరి 03, 2020 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వైఫ్ ఐ 2020లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్‌పీకే స్టూడియోస్ బ్యానర్లపై జి.చరితారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జీఎస్ఎస్‌పీ కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా టీజర్‌ను 29 జులై 2019న విడుదల చేసి,[1] సినిమాను జనవరి 03, 2020న విడుదల చేశారు.[2]
కథ
[మార్చు]వర్మ (అభిషేక్ రెడ్డి) వృత్తిరీత్యా ఒక ఆర్కిటెక్. అయితే తన భార్య కావ్య తప్పిపోయిన కేసుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని ఊహించిన సంఘటనల అనంతరం వర్మ జీవితం కొన్ని అనుకోని మలుపులు తిరుగుతుంది. ఇంతకీ అతని జీవితంలో జరిగిన సంఘటనలకు కారణం ఎవరు ? వర్మ కుటుంబ జీవితంలో జరిగింది ఏమిటి ? చివరికీ వర్మ తన భార్యతో కలుస్తాడా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- అభిషేక్ రెడ్డి
- గుంజన్
- ఫిదా గిల్
- కావ్య
- సునీల్ నగరం
- సూర్య ఆకొండి
- మహేష్ విట్ట
- అపర్ణ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్‌పీకే స్టూడియోస్
- నిర్మాత: జి.చరితా రెడ్డి
- కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: జీఎస్ఎస్‌పీ కళ్యాణ్
- సంగీతం: వినోద్ యాజమాన్య
- సినిమాటోగ్రఫీ: జీఎస్ఎస్‌పీ కళ్యా
- పాటలు: గోసాల రాంబాబు
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (25 November 2019). "Wife,i trailer promises to take us on a romantic ride - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 15 September 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ HMTV (30 December 2019). "Wife i: జనవరి 3 న 'వైఫ్ ఐ'". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.
- ↑ The Times of India (3 January 2020). "Wife, i Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.