Jump to content

వ్యాధినిరోధక టీకాలు వేయించాల్సిన నిర్ణీత సమయాలు

వికీపీడియా నుండి

పశువులు, ఇతర మూగ జీవాలకు నోటి, కాలి వ్యాధి (గాలికుంటు వ్యధి) ప్రబలినప్పుడు నివారణ కోసం ఇచ్చే వ్యాధినిరోధక టీకాలు వేయించాల్సిన నిర్ణీత సమయాలు చాలా ముఖ్యమైనవి.[1] ఇది జంతువుల్లో సంభవించే ఒకానొక తీవ్రమైన వైరల్ అంటువ్యాధి.

  • పుట్టిన దూడలకు మొదటి టీకా నాలుగు నెలలవయసులో, రెండవ టీకా అయిదవ నెలలో, అక్కడి నుంచి ప్రతి నాలుగు నుండి ఆరు నెలలకు ఒకసారి వేయించాలి.[2]
  • వ్యాధి వచ్చిందని అనుమానమున్న పశువులన్నిటికీ ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్ ప్రతి ఆరునెలలకు వేయించాలి. ఈకార్యక్రమంలో పశువులు, గొర్రెలు, మేకలు, పందులు అన్నిటికి వ్యాధినిరోధక టీకాలు వేయించాలి.

టీకాల వివరాలు

[మార్చు]
క్రమ సంఖ్య వయసు టీకా
1 నాలుగవ నెల ఫుట్ అండ్ మౌత్ (యఫ్ యమ్ డి ) వ్యాధినిరోధక టీకా మొదటి డోసు
2 రెండు నుంచి నాలుగు నెలల తర్వాత యఫ్ యమ్ డి రెండో డోసు
3 సంవత్సరానికి మూడుసార్లు (వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రాంతాలలో) లేదా సంవత్సరానికి రెండు సార్లు యఫ్ యమ్ డి బూస్టర్
4 ఆరు నెలలు ఆంత్రాక్స్ టీకా
5 ఆరు నెలలతర్వాత హెమరాజిక్ సెప్టికెమియా

(హెచ్ యస్)టీకా

4 సంవత్సరానికి ఒక్కసారి బి క్యు, హెచ్ యస్, ఆంత్రాక్స్

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, రైతేరాజు (22 March 2020). "పశువులకు గాలికుంటు టీకాలు!". www.eenadu.net. Archived from the original on 30 మార్చి 2020. Retrieved 17 April 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (1 February 2020). "గాలికుంటుకు టీకాలు". www.andhrajyothy.com. Archived from the original on 1 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.