నోటి, కాలి వ్యాధి
Jump to navigation
Jump to search
నోటి, కాలి వ్యాధి | |
---|---|
ప్రత్యేకత | Infectious diseases, veterinary medicine |
నోరు, కాలి వ్యాధి (ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) పశువులు, గొర్రెలు, మేకలు, పందులు మొదలైన చీలుగిట్టలుండే జంతువుల్లో సంభవించే ఒకానొక తీవ్రమైన వైరల్ అంటువ్యాధి.[1] ఈవ్యాధి భారతదేశంలో ఎక్కువగా ఉంది. దీనిద్వరా పశుగణాల సంబంధిత ఎగుమతుల మీద నిషేధం ఉంది. ఈ వ్యాధి బాధితులైన పశువుల వల్ల వాటి ఉత్పాదకత తగ్గటంతో దేశానికి తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతుంది.[2]
ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?
[మార్చు]- తీవ్రమైన జ్వరం
- పాల దిగుబడి తగ్గటం
- నోటిలోను మూతి మీద, కాళ్ళమీద, పొదుగు మీద పుళ్ళు, బొబ్బలు కనిపిస్తాయి
- కాళ్లమీద పుళ్ళు, బొబ్బల మూలంగా కుంటడం
- నోటి నుంచి విపరీతంగా నురగ కార్చటం
వ్యాధి వ్యాప్తి
[మార్చు]- నోరు, కాలి వ్యాధికి గురైన పశువుల లోని అంతస్స్రావాలు వాటి లాలాజలము, పాలు, వాటి పుండ్ల నుంచి కారే రసి లాంటి వంటి విసర్జనలవల్ల, ఈ వ్యాధి కారక వైరస్ లు వ్యాపిస్తాయి .
- ఈ వ్యాధికారక క్రిమి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి గాలిద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా గాలిలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు ఒక చోటు నుండి మరొక చోటుకు త్వరితంగా వ్యాపిస్తుంది.
- వ్యాధిపీడిత పశువుల నుంచి ఆరోగ్యంగా ఉన్న వాటికి కలుషిత ఆహారం, నీరు, వ్యవసాయపనిముట్లు మొదలైన వాటి వల్ల, అలాగే కుక్కలు, పక్షులు, పొలం పనివారి రాకపొకల వల్ల కూడా ఫుట్ అండ్ మౌత్ వ్యాధి సంక్రమిస్తుంది.
- ఈ వ్యాధికి గురైన గొర్రెలు, పందులు అసాధారణ మోతాదులో ఈ వ్యాధికారక వైరస్ ను విసర్జించి ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వ్యాప్తిచెందటంలో కీలకపాత్ర పోషిస్తాయి.
- దేశవాళీ పశువుల కన్నా సంకరజాతి పశువులు త్వరగా ఈ వ్యాధిబారిన పడతాయి,
- వ్యాధిపీడిత పశువులను ఒకచోటి నుంచి మరొకచోటికి రవాణా చెయ్యటం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.[3]
వ్యాధి పరిణామాలు
[మార్చు]వ్యాధిబారిన పడ్డ పశువుల్లో గర్భధారణ విఫలమవుతుంది, వేడిని తట్టుకోలేకపోవటం, పాలదిగుబడి తగ్గిపోతుంది
నియత్రణ
[మార్చు]- వ్యాధి ప్రబలి ఉన్న ప్రాంతాలకు ఆరోగ్యంగా ఉన్న పశువులను తరలించకూడదు
- వ్యాధి వ్యాపించి ఉన్న ప్రదేశాల నుండి పశువులను కొనుగోలు చెయ్యకూడదు
- కొత్తగా కొన్న పశువులను, క్షేత్రంలోని మిగిలిన పశువులనుండి ఎడంగా ఉంచాలి
చికిత్స
[మార్చు]- నోరు, కాలి వ్యాధిపీడిత పశువుల పుండ్లను ఒక్కశాతం పొటాషియం పెర్మాంగనేటు ద్రావణంతో కడగవచ్చు. కాళ్ళ మీద బొబ్బలకు యాంటీ-సెప్టిక్, నోటి లోని పుళ్ళకు బోరిక్ యాసిడ్ గ్లిజరిన్ వాడవచ్చు
- జబ్బుపడ్డ పశువులకు ఉపశమనం కలిగించే జావి దాణామాత్రం పెట్టటం, అలాగే వాటిని ఆరోగ్యంగా ఉన్న పశువులనుంచి దూరం చెయ్యటం
వ్యాధినిరోధక టీకాలు
[మార్చు]వ్యాధినిరోధక టీకాలు వేయించాల్సిన నిర్ణీత సమయాలు చాలా ముఖ్యమైనవి.
- వ్యాధి వచ్చిందని అనుమానమున్న పశువులన్నిటికీ ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్ ప్రతి ఆరునెలలకు వేయించాలి. ఈకార్యక్రమంలో పశువులు, గొర్రెలు, మేకలు, పందులు అన్నిటికి వ్యాధినిరోధక టీకాలు వేయించాలి.
- దూడలకు మొదటి టీకా నాలుగు నెలలవయసులో, రెండవ టీకా అయిదవ నెలలో, అక్కడి నుంచి ప్రతి నాలుగు నుండి ఆరు నెలలకు ఒకసారి వేయించాలి.[4]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, రైతేరాజు (22 March 2020). "పశువులకు గాలికుంటు టీకాలు!". www.eenadu.net. Archived from the original on 30 మార్చి 2020. Retrieved 1 April 2020.
- ↑ ప్రజాశక్తి, ఫీచర్స్ (22 February 2018). "గాలికుంటు లఎంతో చేటు". డాక్టర్. జి. రాంబాబు. Retrieved 1 April 2020.[permanent dead link]
- ↑ ప్రజాశక్తి, ఫీచర్స్ (27 July 2017). "పశుగణాలకు వర్షాకాల గండాలు". డాక్టర్ జి. రాంబాబు,. Archived from the original on 18 అక్టోబరు 2017. Retrieved 1 April 2020.
{{cite news}}
: CS1 maint: extra punctuation (link) - ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (1 February 2020). "గాలికుంటుకు టీకాలు". www.andhrajyothy.com. Archived from the original on 1 ఏప్రిల్ 2020. Retrieved 1 April 2020.