శంభునాథ్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంభునాథ్ సింగ్
Shambhunath Singh 2017 stamp of India.jpg
2017 భారతదేశం స్టాంప్ మీద శంభునాథ్ ఫోటో
జననం(1991-06-17)1991 జూన్ 17
మరణం1991 సెప్టెంబరు 3(1991-09-03) (వయస్సు 0)
జాతీయతభారతదేశం
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, హిందీ రచయిత, కవి

శంభునాథ్ సింగ్ ( 1916 జూన్ 17 - 1991 సెప్టెంబరు 3) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, హిందీ రచయిత, కవి, సామాజిక కార్యకర్త.

జననం, విద్యాభ్యాసం[మార్చు]

శంభునాథ్ 1916, జూన్ 17న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, డియోరియా జిల్లాలోని రావత్‌పర్ గ్రామంలో జన్మించాడు. హిందీలో ఎంఏ చేసి, డాక్టరల్ డిగ్రీని సంపాదించాడు. కొంతకాలం మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ తరువాత వారణాసి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయ హిందీ విభాగం ప్రొఫెసర్ గా పనిచేసి, హెడ్‌గా పదవీ విరమణ పొందాడు.[1]

రచనారంగం[మార్చు]

శంభునాథ్ గేయాలు, నాటకాలు, సాహిత్య విమర్శలు రాశాడు.[1] ఛాయావాద అనే పుస్తకానికి పునఃపరిశీలన కూడా రాశాడు.[2] నిరాశ, అందం కోసం కోరిక ప్రధాన ఇతివృత్తాలుగా దివలోక్ అనే కవితా సంకలనాన్ని ప్రచురించాడు.[3] తరువాత అతను తన భార్య ప్రభావతి సింగ్‌తో కలిసి కాశీకి వెళ్ళిపోయాడు. కొత్త మేధో చైతన్యాన్ని చూపుతూ, మానవ జీవితంలో ఆధునిక అస్థిరత రచనలతో హిందీ కవితా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాడు.[4]

రచనలు[మార్చు]

 • సమయ్ కి శిలా పార్
 • జహ దార్ద్ నీలా హై
 • హరిజన గీతం
 • దివాలోక్
 • రూప రష్మి (1946) [1]
 • ఛాయలోక (1970) [5]
 • ఉదయకాల (1970) [6]
 • నవగీత్ దశక్ (1982) [7]
 • హిందోలోకనే కే జ్యోతి-స్తంభ (1972) [8]

గుర్తింపు[మార్చు]

సమాజంలోని అణగారిన, అట్టడుగున ఉన్న ప్రజల కోసం పనిచేయడానికి స్థాపించిన డాక్టర్ శంభునాథ్ సింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ప్రభుత్వేతర సంస్థకు ఇతని పేరు పెట్టబడింది.[9]

మరణం[మార్చు]

శంభునాథ్ 1991, సెప్టెంబరు 3న మరణించాడు.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 Lal, Mohan (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 9788126012213.
 2. Trivedi, Harish (1993). Colonial Transactions: English Literature and India (in ఇంగ్లీష్). Manchester University Press. ISBN 9780719046056.
 3. Das, Sisir Kumar (1991). History of Indian Literature: 1911–1956, struggle for freedom : triumph and tragedy (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 9788172017989.
 4. "'युगांतकारी कवि थे डॉ. शंभुनाथ सिंह'". Amar Ujala (in హిందీ). Retrieved 2021-05-30.
 5. Singh, Shambhu Nath (1970). Chāyāloka (in హిందీ). Prabhā Prakāśana.
 6. Singh, Shambhu Nath (1970). Udayācala (in హిందీ). Prabhā Prakāśana.
 7. SINGH, SHAMBHU NATH (1982). Navgeet Dashak, Edited by Shambhu Nath Singh (in ఇంగ్లీష్). publisher not identified.
 8. Singh, Shambhu Nath (1972). Hindī ālocanā ke jyoti-stambha (in హిందీ). Samakālīna Prakāśana.
 9. "Home". www.srf.org.in (in ఇంగ్లీష్). Retrieved 26 December 2017.