శటానిక్ వర్సెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల రచయిత సల్మాన్ రష్దీ నాలుగవ నవల "శటానిక్ వర్సెస్" (సైతాను వచనాలు) సంచలనాత్మక, వివాదాస్పద నవల. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. అందుకు అతను చావు బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడు. ఖురాన్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని వచనాలలో ముగ్గురు ఆడ దేవతలని పూజించడానికి అనుమతిస్తున్నట్టు వ్రాసి ఉంది. ఈ దేవతల పేర్లు అల్లాత్, ఉజ్జా, మనాత్. ముస్లింలు నిరాకరించిన ప్రవచనాలని బయట పెట్టినందుకు అతన్ని హత్య చెయ్యాలని ఫత్వా జారీ చెయ్యడం జరిగింది. ముస్లింలు ఏకేశ్వరోపాసకులు. వారు అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని నమ్ముతారు. అష్ హదు అన్ లా ఇలహ ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని నేను ప్రవచిస్తున్నాను అని అర్థం. బైబిల్ లో తొక్కి పెట్టబడిన గ్రంథములు (Apocryphal books) ఉన్నట్టే ఖురాన్ లో కూడా నిరాకరించిన ప్రవచనాలున్నాయని పూర్వపు ముస్లిం చరిత్ర కారులు వ్రాసిన నిజాల్ని నేటి ముస్లిం పండితులు నమ్మడం లేదు. అందుకే సల్మాన్ రష్దీ వ్రాసిన "ధి శటానిక్ వర్సెస్" నవల చాలా ఇస్లామిక్ దేశాలలో నిషేధించబడింది.

నవల పై వ్యతిరేకత

[మార్చు]

1989లో ఇరాన్ కు చెందిన షియా ఇస్లామిక్ నాయకుడు అయాతొల్లాహ్ ఖొమెయినీ సల్మాన్ రష్దీని హత్య చెయ్యాలని ఫత్వా జారీ చేశాడు. ఈ నవలని జపాన్ భాషలోకి అనువదిందిన హితోషి ఇగరాషి (Hitoshi Igarashi) ని జూలై 1991లొ పొడిచి చంపారు. ఇటాలియన్ అనువాదకుడు ఎట్టోర్ కాప్రియోలో (Ettore Capriolo) కత్తి పోట్లకి గురై బతికి బయట పడ్డాడు. 1993 అక్టోబరులో ఆ నవల పబ్లిషర్ విలియం నైగార్డ్ (William Nygaard) పైన హత్యా ప్రయత్నం చేశారు. 1993 జూలై 2న టర్కిష్ అనువాదకుడు అజీజ్ నేసిన్ (Aziz Nesin) కత్తిపోట్లకి గురయ్యి బతికాడు. ఈ నవలని ఇండియాతో పాటు చాలా ఇస్లామిక్ దేశాలలో నిషేధించారు. ఈ నిషేధాన్ని నాస్తిక హేతువాద సంఘాల వారు తీవ్రంగా వ్యతిరేకించారు.2012 జనవరి నెలలో జైపురలో జర్కిన కవి సమ్మెలమ్లొ రస్తి ప్రయథెనిన్ఛరు కని ప్రపుథవమ్ నిరసనకరుల భెతిరిమ్పులవలన రస్ది ఛివరి నిమిషమ్లూ తన నిర్నయన్ని మర్ఛుకున్నదొ

బయటి లింకులు

[మార్చు]