శఠగోపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శఠగోపం (కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అంటారు) అనగా త్యంత గోప్యమైనది అని అర్థం. అంటే అది అత్యంత రహస్యం. భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు. అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకను తలుచుకోవాలంటారు మన పెద్దలు.[1]

విశేషాలు[మార్చు]

శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు. అంటే మనము కోరికలను శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే.[2]

శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.[3]

ఫలితం[మార్చు]

శఠగోప్యమును తలమీద ఉంచిన ప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. శఠగోప్యమును శఠగోపం అని కూడా అంటారు.[4][5]

జనసామాన్యంలో వాడుక[మార్చు]

  • ప్రజల నెత్తిన శఠగోపం : ప్రజలకు ఏదైనా చేస్తానని చెప్పి నమ్మించి ఆ విషయం చేయకపోవడం.
  • దేవుడి భూములకే శఠగోపం : దేవాలయం ఆస్తులు కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఆలయ భూములు కబ్జాలకు గురియగుట.
  • దేవుడికే శఠగోపం.. : స్వామి మాన్యం భూముల్ని పరిరక్షించాల్సిన అధికారులు, పాలకులే కుమ్మక్కై.. దేవుడికే శఠగోపం పెట్టారు.

మూలాలు[మార్చు]

  1. "దేవాలయాలలో శఠగోపం తీసుకోవాలి… ఇందుకేనా?". మూలం నుండి 2016-02-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-06-06. Cite web requires |website= (help)
  2. శఠగోపం ఎందుకు?[permanent dead link]
  3. శిరస్సు మీద శఠగోపం ఎందుకు పెడతారు? సోమవారం, 24 ఫిబ్రవరి 2014
  4. గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు? May 14, 2015[permanent dead link]
  5. గుడిలో శఠగోపం తలమీద పెట్టడం ద్వారా ఫలితం ?

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=శఠగోపం&oldid=2826622" నుండి వెలికితీశారు