Jump to content

శరణ్య శశి

వికీపీడియా నుండి
శరణ్య శశి
జననం1986
పజయంగడి, కేరళ, భారతదేశం
మరణం2021 ఆగస్టు 9 (aged 35)
తిరువనంతపురం, కేరళ, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–2018
జీవిత భాగస్వామి
బిను జేవియర్
(m. 2014)

శరణ్య శశి (1986 - 2021 ఆగస్టు 9) మలయాళం, తమిళ చలనచిత్రాలు, టెలివిజన్ సోప్ ఒపెరాలలో పనిచేసిన ఒక భారతీయ నటి.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

శరణ్య తన పాఠశాల విద్యను కన్నూర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో పూర్తి చేసింది. కాలికట్ విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో డిగ్రీ కూడా చేసింది.[2]

కెరీర్

[మార్చు]

ఆమె 2006లో దూరదర్శన్‌లో ప్రసారమైన బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన సూర్యోదయం అనే సీరియల్‌లో తన వృత్తిని ప్రారంభించింది.[3] ఆమె మలయాళంలో చాకో రాందామన్ (2006), తమిళంలో పచై ఎంగిర కాతు (2012)లో సినీ రంగ ప్రవేశం చేసింది.[4] శరణ్య తన కెరీర్‌లో ఛోట్టా ముంబై (2007), అలీ భాయ్ (2007), తాళ్లప్పావు (2008), బాంబే మార్చి 12 (2011), అన్నమరియా కలిప్పిలాను (2016) వంటి మలయాళ చిత్రాలలో నటించింది. ఆమె స్వామి అయ్యప్పన్, కూటుకారి, రహస్యం, హరిచందనం, అవకాశికల్, మలాఖమర్, కరుతముత్తు వంటి ప్రముఖ టెలివిజన్ సోప్ ఒపెరాలలో కూడా నటించింది.[5][6]

అన్నమరియా కలిప్పిలాను చిత్రం పిల్ల రాక్షసి పేరుతో తెలుగు అనువాద చిత్రముగా విడుదలయింది.[7]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శరణ్య నవంబర్‌ 2014లో బిను జేవియర్‌ను వివాహం చేసుకుంది, అయితే వారు కొంత కాలంలోనే విడాకులు తీసుకున్నారు.[8]

అనారోగ్యం, మరణం

[మార్చు]

2012లో, ఆమెకు ప్రాణాంతక మెదడు కణితి ఉన్నట్లు నిర్ధారణ అయింది, దీంతో ఆమె నటనా వృత్తిని కొనసాగించడానికి కుదరలేదు. మే 2021లో, ఆమె కోవిడ్-19 వ్యాధి సోకడంతో ఆసుపత్రిలో చేరింది, ఇది ఆమె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చింది.[9]

ఆమె క్యాన్సర్, కోవిడ్-19 సమస్యలతో 35 సంవత్సరాల వయస్సులో 2021 ఆగస్టు 9న తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది.[10][11]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2005 మాణిక్యన్ చంద్రలేఖ మలయాళం
2006 చాకో రాందామాన్ అన్నా మలయాళం
2007 చోటా ముంబై షెరిన్ మలయాళం
అలీ భాయ్ కింగిని సోదరి మలయాళం
2008 తాళ్లప్పావు బిందు మలయాళం
2009 ముత్తు ముత్తు షెహనై ప్రేమికుడు మలయాళం ఆల్బమ్
ఫాతిమా బీవీ దారి మలయాళం ఆల్బమ్
2011 ఆజకడల్ నర్తకి మలయాళం
బొంబాయి మార్చి 12 అమీనా మలయాళం
ది హార్ట్ అమ్మ మలయాళం ఆల్బమ్
2012 పచ్చై ఎంగిర కాతు తమిళసెల్వి & ముత్తుసెల్వి తమిళం ద్విపాత్రాభినయం
2016 రారీరం తల్లి మలయాళం ఆల్బమ్
అన్నమరియ కలిప్పిలాను టీచర్ మలయాళం

టెలివిజన్

[మార్చు]
సినిమా ధారావాహిక ఛానల్ పాత్ర నోట్స్
2003 సూర్యోదయం దూరదర్శన్ తొలి మలయాళ సీరియల్
అగ్నిసాక్షి దూరదర్శన్
2004 మైథిలి దూరదర్శన్ పొదిగై మైథిలి తొలి తమిళ సీరియల్
2005 ఈ థనాలిల్ సూర్య టి.వి
రాధామాధవం సూర్య టి.వి
2006 మంత్రకోడి ఏషియానెట్
స్వామి అయ్యప్పన్ ఏషియానెట్ వేదవతి
2006–07 కాయంకులం కొచ్చున్ని సూర్య టి.వి
2008 శ్రీ మహాభాగవతం ఏషియానెట్ అవంతిక
కనక్కుయిల్ ఏషియానెట్ సింధూరి
2008–09 కూట్టుకారి సూర్య టి.వి సూర్య
2009 భామిని తొలకరిల్ల ఏషియానెట్ రేణు
2009–10 రహస్యం అసైనెట్ భామ
2010–12 హరిచందనం ఏషియానెట్ భామ మహదేవన్
2010 స్వామి అయ్యప్పన్ శరణం ఏషియానెట్ మహారాణి గౌరీ
బధ్రా సూర్య టి.వి అన్నమేరీ
2011 స్వామియే శరణమయ్యప్ప సూర్య టి.వి
సరిగమ ఏషియానెట్ పార్టిసిపెంట్
2011–12 అవకాశికలు సూర్య టి.వి అంజలి
2012 కనల్పూవు జీవన్ టీవీ అమృత
మాలాఖమర్ మజావిల్ మనోరమ
స్వాతి జెమినీ టీవీ స్వాతి తెలుగు సీరియల్
2013 దైవం తాండ వీడు స్టార్ విజయ్ సీత తమిళ సీరియల్
వర్తప్రభాతం ఏషియానెట్ న్యూస్ గెస్ట్ స్పీకర్
2014–15 కరుతముత్తు ఏషియానెట్ కన్యా
2014 ఇథాకుకల్ రుచి ఏషియానెట్ న్యూస్ గెస్ట్ స్పీకర్

జడ్జ్

2015–16 మానస మైనా కైరాలి టీవీ మానస
2016 మిజినీర్పూక్కల్ కైరాలి టీవీ మానస
స్మార్ట్ షో ఫ్లవర్స్ టీవీ పాల్గొనేవాడు
2017 మలయాళీ దర్బార్ అమృత టీవీ అతిథి ప్యానెలిస్ట్
2018 సూపర్ జోడి సూర్య టి.వి పోటీదారు రియాలిటీ షో
సీత పువ్వులు వైదేహి
2020 పూలరవేళ మనోరమ న్యూస్ గెస్ట్ స్పీకర్
2021 సిటీలైట్స్ - శరణ్య వ్లాగ్ యూట్యూబ్ ప్రెజెంటర్

మూలాలు

[మార్చు]
  1. "Malayalam actress Saranya dies at 35". Press Trust Of India. 9 August 2021. Retrieved 10 August 2021.
  2. ലേഖകൻ, മാധ്യമം (9 August 2021). "നോവ് ബാക്കിയാക്കി ശരണ്യ മടങ്ങി; ആ പുഞ്ചിരി ഇനി ഓർമ്മയുടെ സ്ക്രീനിൽ..." madhyamam.com (in మలయాళం). Retrieved 10 August 2021.
  3. "Saranya Sasi passes away after battling cancer for 9 years". OnManorama. Retrieved 10 August 2021.
  4. "Breaking News: Famous malayalam actress passes away". East Coast Daily English (in అమెరికన్ ఇంగ్లీష్). 9 August 2021. Retrieved 10 August 2021.
  5. "Malayalam actor Saranya Sasi dies at 35". The Indian Express (in ఇంగ్లీష్). 10 August 2021. Retrieved 10 August 2021.
  6. "Actor Saranya Sasi passes away at 35". The Hindu (in Indian English). 9 August 2021. ISSN 0971-751X. Retrieved 10 August 2021.
  7. "పిల్ల రాక్షసి". Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
  8. "Saranya Sasi passes away after battling cancer for 9 years". OnManorama. Retrieved 10 August 2021.
  9. "35-year-old actress Saranya Sasi passes away after battling cancer for 10 years - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 9 August 2021. Retrieved 10 August 2021.
  10. "Malayalam actor Saranya Sasi dies at 35". The Indian Express (in ఇంగ్లీష్). 10 August 2021. Retrieved 10 August 2021.
  11. "Malayalam actress Saranya Sasi dies at 35 after battling cancer for 10 years". India Today (in ఇంగ్లీష్). Retrieved 10 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=శరణ్య_శశి&oldid=4298852" నుండి వెలికితీశారు