శర్బనాపురం
శర్భనాపురం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలానికి చెందిన శివారు గ్రామం. ఇది జిల్లా ప్రధాన కార్యాలయాలు నల్గొండ నుండి 73 కి.మీ. ఆలేరు నుండి 5 కి.మీ. దూరంలో ఉంది. షర్బనాపురం చుట్టూ పడమటి వైపు యాదగిరిగుట్ట మండలం, దక్షిణ దిశగా ఆత్మకూరు (ఎం) మండలం, తూర్పు వైపు లింగలఘన్‌పూర్ మండలం, పశ్చిమాన భువనగిరి మండలం ఉన్నాయి.[1]
జనగావ్, భోంగిర్, సిద్దిపేట, హైదరాబాద్ నగరాలు షర్బనాపురానికి సమీపంలో ఉన్నాయి. ఈ స్థలం నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా సరిహద్దులో ఉంది.
గ్రామ విశేషాలు
[మార్చు]ఇక్కుర్తి, మాటూర్ల నడుమ 'శర్భనాపురం' చిన్నవూరు.ఈ వూరిలో అతిప్రాచీన శివాలయము ఉంది.ఆ విగ్రహాలు గాలిలోని ఆమ్లానికి శైథిల్యం చెందివున్నాయి. సా.శ.1077 మే 8 నాటి కొలనుపాక శాసనంవల్ల త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు - 6 చేత భువనైక మల్లసోమేశ్వరుడు - 2 తొలగింపబడిన పిదప కందూరునాడును శాశ్వతంగా పొందిన ఏఱువ తొండయచోళ మహారాజుసేవకుడు ‘ఇప శర్భయకామన’ కొలిపాక సోమేశ్వరదేవరకు 2 నందాదివిగెల నిమిత్తం 40 గద్యాలిచ్చాడని తెలుస్తుంది.ఈ సేవకుడు (Sub-ordinate) రాజోద్యోగి అయినందుననే 40 గద్యాలివ్వ గలిగినాడట! బహుశః ఇతని పేరు మీద ఏర్పడ్డదే శర్భనాపురం కావొచ్చు![2]
మూలాలు
[మార్చు]- ↑ "Sharbanapuram Village". www.onefivenine.com. Retrieved 2020-08-25.
- ↑ ( Inscriptions of A.P. Nalgonda Dist. Vol. I, No.13, p:)