శర్మిష్ఠ రౌత్
శర్మిష్ఠ రౌత్ | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1984 ఏప్రిల్ 22
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
శర్మిష్ఠ రౌత్ (జననం 1984 ఏప్రిల్ 22) మరాఠీ సినిమాలు, టీవీ ధారావాహికలలో ప్రధానంగా పనిచేసే భారతీయ నటి.[3][4] స్టార్ ప్రవాలో ప్రసారమైన మన్ ఉధాన్ వర్యాచే అనే ధారావాహికలో నీరజ పాత్రలో, జీ మరాఠీ ధారావాహిక ఉంచ్ మజా జోకాలో తాయ్ కాకుగా, జులున్ యేటి రేషిమ్‌గతి అర్చన పాత్రకు ఆమె బాగా ప్రసిద్ది చెందింది.[5]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]శర్మిష్ఠ రౌత్ 1984 ఏప్రిల్ 22న ముంబైలో జన్మించింది.[6] చాలా చిన్న వయసులోనే భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. ఆమె నాసిక్‌లోని కెటిహెచ్ఎమ్ కళాశాలలో బి.కామ్ చదివింది. ఆ తరువాత కమిన్స్ కళాశాలలో ఎంబిఎ చేసింది.
కెరీర్
[మార్చు]బౌ కోతా కావో బెంగాలీ రీమేక్ అయిన మాన్ ఉధాన్ వర్యాచే సిరీస్‌లో నీరజ పాత్ర పోషించినందుకు ఆమె ప్రశంసలు అందుకుంది. ఉంచ్ మజా జోకా ధారావాహికలో, ఆమె మహదేవరావు వితంతువు తై కాకు పాత్రను పోషించింది. ఆమె నటించిన ఇతర టెలివిజన్ ధారావాహికలలో జులున్ యేతీ రేషిమ్‌గతి, సుఖాచ్యా సారిని హే మాన్ బవేర్, ముల్గి జాలి హో, అబోలి, స్వరాజ్య జననీ జిజామాతా వంటివి ఉన్నాయి.[7][8]
మే 2018లో టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ మరాఠీ మొదటి సీజన్‌లో ఆమె పాల్గొన్నది.[9] ఆమె తుల షిక్విన్ చంగలాచ్ ధడా అనే టీవీ సిరీస్‌కి నిర్మాతగా మొదటి సారిగా వ్యవహరించింది.[10]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | నోట్స్ | మూలాలు |
---|---|---|---|---|---|
2013 | యోద్ధ | మరాఠీ | |||
2013 | రంగకర్మి | రేవతి | మరాఠీ | [11] | |
2017 | చి వా చి సౌ కా | రాగిణి | మరాఠీ | [12] | |
2024 | నాచ్ గ ఘుమా | కల్యాణి | మరాఠీ | [13] |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | ధారావాహిక / కార్యక్రమం | పాత్ర | భాష | ఛానల్ | నోట్స్ | మూలాలు |
---|---|---|---|---|---|---|
2009-2011 | మాన్ ఉధాన్ వర్యాచే | నీరజా మోహితే | మరాఠీ | స్టార్ ప్రవాహ | ||
2012-2013 | ఉంచ్ మఝా జోకా | తాయ్ కాకు | మరాఠీ | జీ మరాఠీ | ||
2013-2015 | జులున్ ఏతి రేషిమ్గతి | అర్చన దుసానే | మరాఠీ | జీ మరాఠీ | [14] | |
2014 | ఫు బాయి ఫు | పోటీదారు | మరాఠీ | జీ మరాఠీ | ||
2017 | ఆజ్ కాయ్ స్పెషల్ | ప్రత్యేక ప్రదర్శన | మరాఠీ | కలర్స్ మరాఠీ | [15] | |
2018 | బిగ్ బాస్ మరాఠీ సీజన్ 1 | పోటీదారు | మరాఠీ | కలర్స్ మరాఠీ | వైల్డ్‌కార్డ్ పోటీదారు | [16] |
2019 | స్వరాజ్యజననీ జీజామాతా | రోషనరా బేగం | మరాఠీ | సోనీ మరాఠీ | ||
2018-2020 | సుఖాచ్యా సారిని హే మాన్ బవారే | సంయోగీత తత్వవాది | మరాఠీ | కలర్స్ మరాఠీ | [17] | |
2021 | ముల్గి జాలి హో | నీలిమా సావంత్ | మరాఠీ | స్టార్ ప్రవాహ | ||
2021-2022 | అబోలి | నీతా | మరాఠీ | స్టార్ ప్రవాహ | ||
2023-ప్రస్తుతం | సార కహి తిచ్యసాతీ | సంధ్య | మరాఠీ | జీ మరాఠీ |
మూలాలు
[మార్చు]- ↑ "Marathi TV celebs who got separated from their real-life partner". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-06-16.
- ↑ "Sharmishtha Raut ties the knot with Thane-based Tejas Desai". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-06-16.
- ↑ "Sharmishta Raut to start her journey as a producer soon". The Times of India. 2023-01-30. ISSN 0971-8257. Retrieved 2023-06-03.
- ↑ "Marathi actress Sharmishta Raut starts production house, will make daily soap". News18 (in ఇంగ్లీష్). 2023-01-31. Retrieved 2023-06-03.
- ↑ "Bigg Boss Marathi: From a Bharatnatyam dancer to an actress, here's a look at Sharmishtha Raut's journey". The Times of India (in ఇంగ్లీష్). 2018-05-24. Retrieved 2023-06-12.
- ↑ "Sharmistha Raut - Birthday". Loksatta (in మరాఠీ). 2021-04-22. Retrieved 2023-06-12.
- ↑ "Sharmishtha Raut: अभिनेत्री आता होणार निर्माती.. शर्मिष्ठा राऊतने सुरु केलं स्वतःचं प्रोडक्शन हाऊस". eSakal - Marathi Newspaper (in మరాఠీ). Retrieved 2023-06-12.
- ↑ "Swarjyajanani Jijamata: Sharmishtha Raut Enters The Show As Mughal Princess Roshanara Begum | SpotboyE". www.spotboye.com (in ఇంగ్లీష్). Retrieved 2023-06-12.
- ↑ "Bigg Boss Marathi: Sharmishtha Raut shares the real reason for entering the house". The Times of India. 2018-05-25. ISSN 0971-8257. Retrieved 2023-06-03.
- ↑ "Sharmishtha Raut turns producer for Tula Shikvin Changlach Dhada; says, "Starting a new journey with the support of my husband Tejas"". The Times of India. 2023-02-08. ISSN 0971-8257. Retrieved 2023-06-03.
- ↑ "Rangkarmi (Marathi Movie) Review". The Common Man Speaks (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-12-27. Retrieved 2023-06-07.
- ↑ "Chi Va Chi Sau Ka Actress Sharmishtha Raut Gets Engaged! - Zee5 News". ZEE5 (in ఇంగ్లీష్). 2020-06-22. Retrieved 2023-06-07.
- ↑ "Naach Ga Ghuma Movie (2024): Cast, Trailer, OTT, Songs, Release Date | Exclusive 2024 - Rang Marathi". Rang Marathi. 30 January 2024. Retrieved 17 March 2024.
- ↑ "अभिनेत्रीचा ऑनस्क्रिन भाऊ आजही आहे तिच्या पाठीशी; आठवतेय का ही मराठी मालिका?". News18 Lokmat (in మరాఠీ). Retrieved 2023-06-16.
- ↑ "Sharmishtha Raut and Shashank Ketkar to flaunt their culinary skills in Aaj Kay Special". The Times of India. 2020-11-25. ISSN 0971-8257. Retrieved 2023-06-03.
- ↑ "Bigg Boss Marathi finalists Smita, Sai, Pushkar, and Sharmishtha thank their fans; see videos". The Times of India. 2018-07-25. ISSN 0971-8257. Retrieved 2023-06-12.
- ↑ "Sharmishtha Raut Bids Adieu To Fans Of He Mann Baware With This Last Shot | SpotboyE". www.spotboye.com (in ఇంగ్లీష్). Retrieved 2023-06-03.