Jump to content

శలపాడు

అక్షాంశ రేఖాంశాలు: 16°15′27″N 80°33′57″E / 16.25746°N 80.56579°E / 16.25746; 80.56579
వికీపీడియా నుండి

శలపాడు గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

శలపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
శలపాడు is located in Andhra Pradesh
శలపాడు
శలపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°15′27″N 80°33′57″E / 16.25746°N 80.56579°E / 16.25746; 80.56579
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చేబ్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 212
ఎస్.టి.డి కోడ్ 08644

గ్రామములోని విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఆర్.సి.ఎం.పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు

[మార్చు]

శ్రీమతి వెలగపూడి నళిని స్మారక సామాజిక భవనం

[మార్చు]

ఈ గ్రామంలో దాత, ప్రవాసాంధ్రుడు వెలగపూడి బాపూజీ, తన సతీమణి కీ.శే. నళిని జ్ఞాపకార్ధం, 60 లక్షల రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఈ భవనాన్ని 2017, జనవరి-29న ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కనగాల నాగయ్య, సర్పంచిగా ఎన్నికైనాడు..

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయం 200 సంవత్సరాల చరిత్ర గలది. నూతనంగా పునర్మించిన ఈ ఆలయంలో, 2015, మే-29వ తేదీ శుక్రవారంనుండి, 31వ తేదీ ఆదివారం వరకు, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు. మే-31వ తేదీ ఆదివారంనాడు, శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అగ్నిధ్యానం, తదితర పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహ, ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ఠలు గావించారు. మహాపూర్ణాహుతి, శాంతికళ్యాణం నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం, నాలుగువేలకుమందికిపైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

[మార్చు]

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయo

[మార్చు]
  1. శలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ ప్రతిష్ఠాకార్యక్రమాలు, 2014.జూన్-6, శుక్రవారం నాడు ప్రారంభమైనవి. శనివారం నాదు ఆలయంలో విష్వక్సేనపూజ, పుణ్యాహం, వాస్తుపూజ, వాస్తుహోమం, క్షీరాభివాసం, జలాధివాసం, పాయసహోమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం గ్రామోత్సవం, శాంతిహోమాలను నిర్వహించారు.
  2. ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2015, మే-28వ తేదీ గురువారంనాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకాలు, సాయిసత్యవ్రతాలు, గ్రామోత్సవం, గురుహోమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం

[మార్చు]

గ్రామ విశేషాలు

[మార్చు]
  1. ఈ గ్రామములోలో కొంతమంది మహిళలు మట్టితో కుండలు తయారుచేసి, జీవనం సాగిస్తునారు. వీరికి "జె.ఎం.జె.సోషల్ సర్వీసెస్" అను స్వచ్ఛంద సంస్థవారు, మట్టితో వివిధ గృహాలంకరణ వస్తువులు, అందమైన కళాకృతులు తయారు చేయుటకొరకు, ఒక శిక్షణా శిబిరం ఏర్పాటుచేసి, వీరి నైపుణ్యాన్ని మెరుగుపరచుచున్నారు. ఈ రకంగా వీరిని ప్రోత్సహించి, తమ ఆదాయాన్ని గణనీయంగా వృద్ధిచేసుకొనుటకు తోడ్పడుచున్నారు.
  2. వివేక సజ్జనబంధు సేవాసమితి:- 25 సంవత్సరాల నుండి విద్యారంగంలో అలుపెరుగక విద్యార్థులను ప్రోత్సహించుచూ సేవలుచేయుచున్న ఈ సంస్థ, 2015, డిసెంబరు-23వ తేదీనాడు రజతోత్సవం జరుపుకున్నది.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శలపాడు&oldid=3597773" నుండి వెలికితీశారు