శస్త్రవైద్యుడు
Appearance
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఔషధాలతో పాటు, అవసరమయితే ఆయుధాల ద్వారా అనగా శస్త్రముల ద్వారా చికిత్సను నిర్వహించి వ్యాధులను నయం చేయగల నిపుణులను శస్త్రవైద్యులు అంటారు. వైద్య కళాశాలల నుండి వీరు డాక్టర్ ఆఫ్ సర్జరీ లేక మాస్టర్ ఆఫ్ సర్జరీ అనే పేర్లతో పట్టాలను పొంది యుంటారు.
వివిధ శస్త్రచికిత్సలు
[మార్చు]వివిధ అవయవాలకు చేసే శస్త్ర చికిత్సలను కింది పేర్లతో పిలుస్తారు.
- జనరల్ సర్జరీ - సాధారణ శస్త్ర చికిత్స
- కార్డియోథొరాసిక్ సర్జరీ - గుండె శస్త్ర చికిత్స
- కోలోరెక్టల్ సర్జరీ - పెద్ద ప్రేగు శస్త్ర చికిత్స
- పీడియాట్రిక్ సర్జరీ - చిన్న పిల్లల శస్త్ర చికిత్స
- థొరాసిక్ సర్జరీ - థొరాక్స్ అవయవముల శస్త్ర చికిత్స
- ప్లాస్టిక్ సర్జరీ - సౌందర్య శస్త్ర చికిత్స
- వాస్క్యూలర్ సర్జరీ - రక్త నాళాలు, కండరాల శస్త్ర చికిత్స
- ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ - అవయవ మార్పిడి శస్త్ర చికిత్స
- ట్రౌమా సర్జరీ - సంక్లిష్ట శస్త్ర చికిత్స
- ఓటోలారింగాలజీ - చెవి, ముక్కు, గొంతు శస్త్ర చికిత్స
- అప్పర్ గాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జరీ - జీర్ణాశయ శస్త్ర చికిత్స
- సర్జికల్ ఆంకాలజీ - కాన్సర్ శస్త్ర చికిత్స
- గైనకాలజీ - గర్భాశయ శస్త్ర చికిత్స
- ఓరల్ అండ్ మాక్సిలోఫేసియల్ సర్జరీ - నోరు, ముఖం పైదవడ శస్త్ర చికిత్స
- ఆర్థోపెడిక్ సర్జరీ - ఎముకలు, కీళ్ళ శస్త్ర చికిత్స
- న్యూరో సర్జరీ - మెదడు, నాడీ వ్యవస్థ శస్త్ర చికిత్స
- అప్తాల్మాలజీ - నేత్ర శస్త్ర చికిత్స
- పొడియాట్రిక్ - పాద శస్త్ర చికిత్స
- యూరాలజీ - మూత్ర పిండముల శస్త్ర చికిత్స
- డెంటల్ సర్జరీ - దంత శస్త్ర చికిత్స
- వెటర్నరీ సర్జరీ - పశు శస్త్ర చికిత్స
వైద్య శాస్త్రానికి సేవలందించిన ప్రముఖులు
[మార్చు]- ముక్కుకు సంబంధించిన రైనోప్లాస్టీ (Rhinoplasty) అనే శస్త్రచికిత్సను మొదటిసారిగా చేసిన భారతీయ వైద్యుడు - శుశ్రుతుడు[1]
మందులు
[మార్చు]- హెక్సాక్లోరోఫేన్: శస్త్రచికిత్సకు ముందు తమ చేతులను శుభ్రపరచుకోవడానికి ఆరోగ్య సంరక్షణ కార్మికులు ఉపయోగించేది.
మూలాలు
[మార్చు]- ↑ Ira D. Papel, John Frodel, Facial Plastic and Reconstructive Surgery