శాంతిదేవి
Jump to navigation
Jump to search
శాంతిదేవి | |
---|---|
జననం | ఏప్రిల్ 18, 1934 గుణ్ పూర్, రాయగడ జిల్లా, ఒడిశా |
మరణం | జనవరి 16, 2022 గుణ్ పూర్, రాయగడ జిల్లా , ఒడిశా |
మరణ కారణం | గుండెపోటు |
విద్య | ఇంటర్మీడియట్ |
శాంతిదేవి (ఏప్రిల్ 18, 1934 - జనవరి 16, 2022)[1] సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత.
ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా గుణ్ పూర్ గ్రామంలో జన్మించిన శాంతిదేవి కొరాపూట్ లో ముందుగా చిన్న ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆడపిల్లల అభివృద్ధి కోసం రాయగడలో శివ సమాజ్ ను స్థాపించారు. గుణ్ పూర్ లో మరో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అనాథలు, నిరుపేద పిల్లలకు విద్య, పునరావాసం, వృత్తి శిక్షణ తదతర అంశాలపై కృషి చేసారు. శాంతిదేవి చేసిన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021లో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ తో సత్కరించింది.[2]
ఆమె భూదాన్ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఆచార్య వినోబా భావేతో కలిసి పనిచేశారు. 1961లో ఉత్కల్ నవజీవన్ మండల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Velugu, V6 (2022-01-17). "పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతి దేవి మృతి". V6 Velugu (in ఇంగ్లీష్). Retrieved 2022-01-20.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి కన్నుమూత". EENADU. Retrieved 2022-01-20.
- ↑ "Know Padma Shri Award Nominee Shanti Devi From Odisha". Odisha Bytes (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-01-26. Retrieved 2022-01-20.