Jump to content

శాంతిశ్రీ ధూళిపూడి

వికీపీడియా నుండి

శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ - ప్రతిష్ఠాత్మక జవహార్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)కు తొలి మహిళా వైస్ ఛాన్స్ లర్ (వీసీ). [1]

తెలుగు మూలాలున్న ప్రొఫెసర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ 1962 జూలై 15న రష్యాలో జన్మించారు. ఆమె తండ్రి డి.ఆంజనేయులు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి. ఆయన కేంద్ర సమాచార ప్రసార శాఖలో అధికారిగా, తల్లి మూలమూడి ఆదిలక్ష్మి రష్యాలోని లెనిన్‌గ్రాడ్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. శాంతిశ్రీ హైస్కూల్‌ విద్యను చెన్నైలో అభ్యసించారు. 1978లో 10వ తరగతి, 1980లో 12వ తరగతుల్లో ఆమె తమిళనాడు రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. కాలిఫోర్నియా వర్సిటీ నుంచి సోషల్‌వర్క్‌లో డిప్లొమా పట్టా పుచ్చుకున్నారు. 1983లో మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి బీఏ, ఆ తరువాత పీజీ పట్టా అందుకున్నారు. జేఎన్‌యూ నుంచి ఎంఫిల్‌లో టాపర్‌గా నిలిచారు. అంతర్జాతీయ వ్యవహారాలపై జేఎన్‌యూ నుంచి పీహెచ్‌డీ పూర్తిచేశారు. స్వీడన్‌లో పోస్ట్‌ డాక్టొరల్‌ డిప్లొమా చేశారు.

మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫులే విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిత్‌ 2022 ఫిబ్రవరి 7న జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) తొలి మహిళా ఉప కులపతిగా నియమితులవ్వడానికి కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఆమె ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". edu.andhrajyothy.com. Archived from the original on 2022-02-08. Retrieved 2022-02-08.
  2. Eenadu (8 February 2022). "జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ". Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.
  3. Andhra Jyothy (21 March 2022). "అక్కడ వారిదే పెత్తనం!". Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.