హైడ్రోమీటర్
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఇతర పేర్లు | హైడ్రోమీటర్ |
---|---|
ఉపయోగాలు | ద్రవముల విశిష్టగురుత్వం కనుగొనుటకు |
ఆవిష్కర్త | హైపాటియా(అలెగ్జాండ్రియా) |
హైడ్రోమీటర్ ను ద్రవముల విశిష్టగురుత్వము కనుగొనుటకు ఉపయోగిస్తారు.అనగా ద్రవముల సాపేక్ష సాంద్రతను కనుగొనుటకు ఉపయోగిస్తారు.
నిర్మాణము
[మార్చు]ఇది సాధారణంగా స్థూపాకారపు కాడ కలిగి ఉంటుంది. దీని క్రింది భాగములో పాదరసం లేదా సీసము (మూలకము)తో నిండియున్న బల్బు ఉంటుంది. కాడపై ఒక స్కేలు క్రమాంకనం చేయబడి ఉంటుంది. ఈ పరికరం ద్రవంలో నిలువుగా తేలియాడుతున్నట్లు ఉంటుంది. ఈ పరికరమును ఏ ద్రవం విశిష్ట గురుత్వం కనుగొనాలనుకుంటున్నామో దానిలో ఉంచినపుడు అది కొంత వరకు మునిగి కొంత భాగం తేలుతుంది. ద్రవం యొక్క తలం హైడ్రోమీటరులో ఏ భాగమును తాకుతుందో ఆ విభాగము ఆ ద్రవం యొక్క విశిష్ట గురుత్వం అవుతుంది.
నియమం
[మార్చు]ఈ పరికరం ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అనగా ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం ఒక వస్తువు ద్రవంలో పూర్తిగా మునిగినపుడు వస్తువుపై కలుగజెయబడిన ఊర్థ్వ ఒత్తిడి ఆ వస్తువు కోల్పోయిన ద్రవ భారవుతో సమానంగా ఉంటుంది.
వివిధ హైడ్రోమీటర్లు,వాటి ఉపయోగం
[మార్చు]రకం | ఉపయోగాలు |
లాక్టోమీటర్ | పాల స్వచ్ఛత తెలుసుకొనుటకు |
ఆల్కహాలోమీటర్ | ద్రవములలో ఆల్కహాల్ బలం తెలుసుకొనుటకు |
శాకరోమీటర్ | ద్రావణంలో చక్కెర శాతం తెలుసుకొనుటకు |
థెర్మో హైడ్రోమీటర్ | పెట్రోలియం ఉత్పత్తుల సాంద్రత తెలుసుకొనుటకు |
యూరినోమీటర్ | మూత్ర పరీక్ష చేయుటకు |
అసిడోమీటర్ | ఆమ్లం యొక్క విశిష్టగురుత్వం కనుగొనుటకు |