శాఖా మార్గం
శాఖా మార్గం అనేది హైవే, ఫ్రీవే, ఇంటర్‌స్టేట్ హైవే లేదా మోటర్‌వే వంటి పొడవైన, ముఖ్యమైన రహదారి నుండి చీలి శాఖగా ఏర్పడే చిన్న రహదారి. ఇంగ్లీషులో దీన్ని స్పర్ రూట్ అంటారు. బైపాస్ లేదా బెల్ట్‌వే లు సాధారణంగా మరొక రహదారితో గానీ, తిరిగి అదే ప్రధాన రహదారితో గానీ కలుస్తాయి కాబట్టి వాటిని శాఖా మార్గంగా పరిగణించరు.
భారతదేశం
[మార్చు]భారత జాతీయ రహదారి వ్యవస్థలో ప్రధాన జాతీయ రహదారుల శాఖలను అక్షరాల ప్రత్యయాలతో సూచిస్తారు. ఉదాహరణకు, జాతీయ రహదారి 1 కి నాలుగు శాఖా మార్గాలున్నాయి. అవి: ఎన్‌హెచ్ 1A, ఎన్‌హెచ్ 1B, ఎన్‌హెచ్ 1C, ఎన్‌హెచ్ 1D, వీటిలో అతి చిన్నదైన ఎన్‌హెచ్ 1C కేవలం 6 కిలోమీటర్లు (3.7 మై.) పొడవుండగా, అత్యంత పొడవైన ఎన్‌హెచ్ 1A 663 కిలోమీటర్లు (412 మై.) పొడవుంది. శాఖా మార్గాలు మాతృ జాతీయ రహదారి వద్ద ఉద్భవించినప్పటికీ, కొన్ని శాఖలు భారతదేశంలోని ముఖ్యమైన నగరాలకు సేవలందిస్తుంటాయి కాబట్టి అవి హోదాలో రెండవ స్థాయికి చెందినవని అనుకోరాదు. ఉదాహరణకు, శాఖామార్గం ఎన్‌హెచ్ 1A జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ ను కలుపుతోంది. ముఖ్యమైన భారతీయ ఓడరేవులను అనుసంధానించడానికి ప్రత్యేకంగా కొన్ని శాఖా మార్గాలున్నాయి. ఉదాహరణకు: ఎన్‌హెచ్ 5A పారదీప్‌ను దాని మాతృ ఎన్‌హెచ్ 5 తో కలుపుతుంది. అలాగే ఎన్‌హెచ్ 7A ట్యూటికోరిన్‌ను ఎన్‌హెచ్ 7 తో కలుపుతుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- ప్రత్యేక మార్గం
- లూప్ మార్గం
- రింగు రోడ్డు