Jump to content

శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం

వికీపీడియా నుండి
పావ్ లోవ్ కుక్క పై చేసిన ప్రయోగం

శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం ఆధునిక మనస్తత్వ శాస్త్ర శాఖల కేంద్ర నమూనాలలో ఒకటి. ఇది ప్రవర్తనవాదంలో మొదటిది. దీనిని రష్యా కు చెందిన ఇవాన్ పావ్ లోవ్ ప్రతిపాదించాడు. దీనిని సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం అనీ, ఎస్ టైపు సిద్ధాంతం అనీ, నిబంధిత అభ్యసన సిద్ధాంతం అనీ అంటారు.[1]

ఇవాన్ పావ్ లోవ్

[మార్చు]
ఇవాన్ పావ్ లోవ్

ఇతను జంతువుల జీర్ణక్రియలపై పరిశోధన చేసి నిబంధిత ప్రతిక్రియ చర్యను రూపొందించిన వ్యక్తి. దీనికి గాను 1904, డిసెంబర్ 10 న శరీర ధర్మశాస్త్రం లో నోబుల్ బహుమతి లభించింది. ది వర్క్ ఆఫ్ డైజెస్టీవ్ గ్లాండ్స్, ది కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అనేవి ఇతని గ్రంథాలు.

ప్రయోగం

[మార్చు]

పావ్ లోవ్ తన ప్రయోగాన్ని ఒక కుక్క పై చేశాడు. కుక్కను ఒక తాడుతో కట్టి, దాని నోట్లోని లాలాజలం ఒక బీకరు లోకి వచ్చేట్టు ఒక పైపు ను అమర్చాడు. కుక్కకు ఆహారం చూపించడం అనేది సహజ ఉద్దీపన గా, గంట కొట్టడం అనేది అసహజ ఉద్దీపన గా భావించి ప్రయోగం నిర్వహించాడు. వివిధ సందర్భాలలో కుక్కకు వచ్చిన లాలాజల పరిశీలన తో తగిన నిర్దారణకు వచ్చాడు. పావ్ లోవ్ ఈ ప్రయోగాన్ని మూడు దశలుగా నిర్వహించాడు.[2]

ప్రయోగ దశలు

[మార్చు]

మొదటి దశ

[మార్చు]

ఈ దశలో కుక్కకు సహజ ఉద్దీపన అయిన ఆహారాన్ని చూపినపుడు కుక్క నోట్లో నుండి కొంత లాలాజలం ఏర్పడింది. ఇలా ఏర్పడిన లాలాజలాన్ని సహజ ప్రతిస్పందనగా భావించాడు. ఇదే సందర్భంలో అసహజ ఉద్దీపన అయిన గంట మోగించాడు ఎటువంటి ప్రతిస్పందన రాలేదు.

రెండవ దశ

[మార్చు]

ఈ దశలో కుక్కకు సహజ ఉద్దీపన అయిన ఆహారం తో పాటు అసహజ ఉద్దీపన గా భావించిన గంటను కూడా మోగించాడు. గంట కొట్టిన వెంబడే ఆహారాన్ని అందిస్తున్నాడు. ఈ ప్రక్రియను చాలా సార్లు చేశాడు. ఇక్కడ సహజ ఉద్దీపన, అసహజ ఉద్దీపన మధ్య సంసర్గం ఏర్పడుతుంది. సహజ ప్రతిస్పందనగా అంతే పరిమాణం లో లాలాజలం ఏర్పడుతుంది.

మూడో దశ

[మార్చు]

ఈ దశలో కేవలం అసహజ ఉద్దీపన అయిన గంట మాత్రమే మోగిస్తున్నాడు తద్వారా లాలాజలం కూడా అంతే పరిమాణం లో వస్తుంది ఇలా వచ్చిన లాలాజలాన్ని అసహజ ప్రతిస్పందన గా భావించాడు.[3]

ఫలితం

[మార్చు]

సహజ ఉద్దీపన అయిన ఆహారానికి ఏవిధమైన లాలాజలం వచ్చిందో అసహజ ఉద్దీపన అయిన గంటకు కూడా అదే విధమైన లాలాజలం వచ్చింది. ఇదే శాస్త్రీయ నిబంధనం గా చెప్పాడు.

సిద్ధాంత అనుప్రయుక్తం

[మార్చు]

1. పాఠశాల గంట మోగగానే విద్యార్థులు పాఠశాలకు వెళ్ళడం.

2. ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఎర్ర లైటు వెలగగానే ఆగటం, ఆకుపచ్చ లైటు వెలగగానే ముందుకు వెళ్ళటం.[4]

మూలాలు

[మార్చు]
  1. "American Psychologist", Wikipedia (in ఇంగ్లీష్), 2020-03-01, retrieved 2020-07-10
  2. Pavlov, Ivan Petrovitch (1928). Conditioned Reflexes And Psychiatry. International Publishers Co. Inc.
  3. "The Behavior Of Organisms An Experimental : B F Skinner : Free Download, Borrow, and Streaming". Internet Archive (in ఇంగ్లీష్). Retrieved 2020-07-10.
  4. బాల్యదశ వికాసం అభ్యసనం. తెలుగు అకాడమీ డి ఎల్ ఎడ్ మొదటి సంవత్సరం.