శివదా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివదా
2022లో శివదా
జననం
కె. వి. శ్రీలేఖ నాయర్

(1986-04-23) 1986 ఏప్రిల్ 23 (వయసు 38)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
మురళీ కృష్ణన్
(m. 2015)
పిల్లలు1

శివదా (ఆంగ్లం: Sshivada; 1986 ఏప్రిల్ 23) భారతీయ నటి. ఆమె ప్రధానంగా మలయాళం, తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె అసలు పేరు కె. వి. శ్రీలేఖ నాయర్.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

శివదా తమిళనాడులోని తిరుచిరాపల్లిలో మలయాళీ కుటుంబానికి చెందిన విజయరాజన్, కుమారి దంపతులకు కె. వి. శ్రీలేఖ నాయర్‌గా జన్మించింది. అక్కడ ఆమె 5వ తరగతి వరకు చదువుకుంది.[1] ఆ తర్వాత ఆమె కుటుంబం అంగమాలికి మారింది. అక్కడ ఆమె విశ్వజ్యోతి సిఎంఐ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంది. ఆమె ఆది శంకర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.[2]

కెరీర్[మార్చు]

2009 మలయాళ చిత్రం కేరళ కేఫ్‌లో చిన్న పాత్ర ద్వారా శివదా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ సినిమా తర్వాత చాలా కాలం టెలీవిజన్ ఛానెల్ ప్రోగ్రామ్స్‌లో యాంకర్‌గా పనిచేసింది. ఆ సమయంలో ఆమె మలయాళ దర్శకుడు ఫాజిల్ దృష్టిలోపడి 2011లో లివింగ్ టుగెదర్‌లో మహిళా ప్రధాన పాత్ర పోషించడం ద్వారా తిరిగి సినిమా రంగంలో అడుగుపెట్టింది.[3] ఆ తర్వాత తమిళ చిత్రం నెడుంచాలై లో నటించడంతో పాటు చాలా సినిమాలు చేసింది. ఆమె మాతృభాష మలయాళం అయినప్పటికీ తన మొదటి తమిళ చిత్రానికే డబ్బింగ్ చెప్పగలిగింది. ఈ చిత్రంలో మంగ పాత్రలో శివదా ప్రశంసలు అందుకుంది కూడా.[4]

ఉన్ని ముకుందన్‌ నటించిన మలయాళ చిత్రం చాణక్య తంతరమ్‌(2018) లో శివదా కథానాయికగా నటించింది. కణ్ణన్‌ తమెరక్కులమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని అశోక ది గ్రేట్‌ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించారు.[5] అలాగే ఆమె నటించిన మరికొన్ని సినిమాలు గతంలో తెలుగులోకి డబ్బింగ్ అయ్యాయి. 2023లో విజయవంతమైన మలయాళ చిత్రం 2018ని తెలుగులో అదే పేరుతో విడుదలవగా ఇక్కడా వసూళ్లవర్షం కురిపిస్తోంది.[6]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె తన చిరకాల ప్రియుడు మురళీ కృష్ణన్‌ను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది.[7]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

Year Title Role Language Ref
2008 నీనక్కాయి... మలయాళం
2009 కేరళ కేఫ్ మలయాళం
2010 మజా శ్రీలేఖ మలయాళం
2011 నిలవు శ్రీలేఖ మలయాళం
లివింగ్ టుగెదర్ శ్యామా మలయాళం
2014 నెడుంచాలై మాంగ తమిళం
2015 సు.. సు... సుధీ వాత్మీకం కల్యాణి మలయాళం [8]
2016 జీరో ప్రియా తమిళం [9][10]
IDI - ఇన్‌స్పెక్టర్ దావూద్ ఇబ్రహీం నిత్య మలయాళం [11][12]
2017 అధే కనగల్ దీప/ అశ్విని/ ప్రియ/ వసుంధర తమిళం [9]
లక్ష్యం శాలిని మలయాళం
అచాయన్స్ జెస్సికా మలయాళం [13]
రామంటే ఏడంతొట్టం వాయిస్ మలయాళం
2018 శిక్కరి శంభు అనిత మలయాళం [14]
చాణక్య తంతరమ్‌ ఐరీన్ మలయాళం [15]
2019 లూసిఫర్ గోవర్ధన్స్ వైఫ్ మలయాళం
నా శాంటా ఇసాస్ మదర్ మలయాళం
2021 మార కని తమిళం
సన్నీ నిమ్మీ మలయాళం
2022 మేరీ ఆవాస్ సునో మెరిల్ మలయాళం
ట్వెల్త్ మ్యాన్ డా. నయన మలయాళం
నితమ్ ఒరు వానం నిజమే మీనాక్షి తమిళం
2023 వల్లవనుక్కుమ్ వల్లవన్ అళగి తమిళం
జవానుం ముల్లపూవుం జయశ్రీ టీచర్ మలయాళం [16][17]
2018 మలయాళం [18][19]
తీరా కాదల్ తమిళం [20]
సీక్రెట్ హోమ్ TBA మలయాళం [21]

మూలాలు[మార్చు]

  1. "I can act only if I know the language : Sshivada". The Times of India. 16 January 2017.
  2. "എന്റെ പ്രണയത്തില്‍ താജ്‌മഹലില്‍..." Mangalam.
  3. Vishal menon (24 January 2015). "Bitten by the acting bug". The Hindu.
  4. "Shivada – The terrific newcomer in K-town!". Sify. Archived from the original on 27 December 2015.
  5. "Unni Mukundan and Sshivada new movie launch - Sakshi". web.archive.org. 2023-06-01. Archived from the original on 2023-06-01. Retrieved 2023-06-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "2018 Telugu Movie Review And Rating - Sakshi". web.archive.org. 2023-05-26. Archived from the original on 2023-05-26. Retrieved 2023-05-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Each and every moment of my life is a bliss". The Times of India. 16 December 2020.
  8. "A fine balance – The Hindu". The Hindu. 16 November 2016.
  9. 9.0 9.1 "SIIMA awards 2017 nominations announced". Sify. Archived from the original on 3 July 2017.
  10. "Shivada signs 'zero', a supernatural thriller". Sify. Archived from the original on 26 April 2015.
  11. George, Anjana (16 March 2016). "Jayasurya to romance Sshivada again in IDI". The Times of India. Retrieved 18 August 2016.
  12. Soman, Deepa (24 April 2016). "Sshivada to have an action intro in her next". The Times of India. Retrieved 18 August 2016.
  13. "Comedy Awards 2016 on Asianet". indiatimes. Retrieved 21 January 2017.
  14. Soman, Deepa. "When a vegetarian Sshivada had to play a butcher". The Times of India.
  15. "Sshivada and Sruthi Ramachandran in Chanakya Thanthram". The Times of India. 6 December 2017.
  16. "Javanum Mullapoovum: Sshivada plays a teacher, makers release first look". The New Indian Express. Retrieved 17 January 2023.
  17. "'Jawanum Mullapoovum' trailer: Sshivada starrer is a complete family entertainer". The Times of India. 29 March 2023.
  18. "Jude Anthony Joseph Unveils Title of his Upcoming Film Based on 2018 Kerala Floods". News18 (in ఇంగ్లీష్). 5 November 2022. Retrieved 17 January 2023.
  19. "It's a wrap for Tovino Thomas, Asif Ali, and Kunchacko Boban's '2018' based on the Kerala floods". The Times of India. 16 November 2022. Retrieved 16 March 2023. The filming of Jude Anthany Joseph's upcoming film '2018 – Everyone is a hero' has been completed. The makers wrapped up the shoot on Sunday (Nov 13).
  20. "Director Rohin talks about his Jai-Aishwarya Rajesh starrer Theera Kadhal". Cinema Express. 27 March 2023.
  21. "Sshivada, Chandhunadh, Aparna Das and Anu Mohan to headline Secret Home". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2023-04-03.
"https://te.wikipedia.org/w/index.php?title=శివదా&oldid=3921177" నుండి వెలికితీశారు