శివ్-హరి
స్వరూపం
శివ్-హరి | |
---|---|
మూలం | భారతదేశం |
క్రియాశీల కాలం | 1967–2022 |
సభ్యులు |
శివ్-హరి భారతదేశానికి చెందిన సంగీత దర్శకులు. వీరిలో సుప్రసిద్ధ సంతూర్ వాద్యకారుడు పండిట్ శివకుమార్ శర్మ, సుప్రసిద్ధ వేణు నాథసంగీతకారుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా ఇద్దరు కలిసి హిందీలో ‘సిల్సిలా’, ‘లమ్హే’, ‘చాందిని’ వంటి హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించారు.[1] శివ-హరి కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉన్నారు. వారు 2011లో లండన్, సింగపూర్ వంటి పలు ప్రాంతాల్లో పర్యటించారు.[2][3]
శివ్-హరి 1967లోనే గిటారిస్ట్ బ్రిజ్ భూషణ్ కబ్రా యొక్క చురుకైన భాగస్వామ్యంతో 'కాల్ ఆఫ్ ది వ్యాలీ' పేరుతో ఆల్బమ్‌ను రికార్డ్ చేశారు. ఈ ఆల్బమ్‌లో గిటార్‌ని వినూత్నంగా ఉపయోగించడం వల్ల పాశ్చాత్య దేశాల ప్రజలలో ఇది ప్రజాదరణ పొందింది. భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఇప్పటివరకు రికార్డ్ చేయబడిన అత్యంత విజయవంతమైన ఆల్బమ్‌లలో ఇది ఒకటి.[4]
సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]- సిల్సిలా (1981)
- ఫాస్లే (1985)
- విజయ్ (1988)
- చాందిని (1989)
- లమ్హే (1991)
- పరంపర (1993)
- సాహిబాన్ (1993)
- డర్ (1993)
ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
[మార్చు]- సిల్సిలా (1981)
- చాందిని (1989)
- లమ్హే (1991)
- డర్ (1993)
మూలాలు
[మార్చు]- ↑ "Santoor magic". The Hindu. Chennai, India. 27 February 2005. Archived from the original on 5 March 2005.
- ↑ The Times of India (2011). "Shiv-Hari duo to perform at Singapore" (in ఇంగ్లీష్). Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.
- ↑ Shiv-Hari in Concert - inSing.com Archived 2012-03-18 at the Wayback Machine
- ↑ Sharma, Shivkumar (15 September 2000). "The Valley Recalls, Vol. 1" (in ఇంగ్లీష్). Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.