శివ ధనుస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరాముడు శివధనస్సును ఎత్తడం(రాజా రవివర్మ చిత్రం)

శివ ధనుస్సు హిందూ పురాణాల ప్రకారం పరమశివుని దివ్యాయుధం. ఈ ధనుస్సుతోనే శివుడు దక్షుని యజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు. [1]. దేవతలందరూ కలిసి శివుణ్ణి మెప్పించి ఈ ధనుస్సును సంపాదించారు. ఆ తరువాత దేవతలు మిథిలా నగరానికి రాజైన దేవరాతుడికి యజ్ఞఫలంగా బహూకరించారు. దీనిని పినాకము అని అంటారు.

సీతాదేవి ఒకసారి తన చెల్లెళ్ళతో ఆడుకొను చుండగా పొరపాటున శివధనస్సునుంచిన బల్లను కదిలించడం జరిగింది. రాజ సౌధం లోని వారెవరూ ఇంతకు ముందెన్నడూ దానిని కదిలించ లేక పోయారు. దీనిని గమనించిన జనక మహారాజు సీతా స్వయంవరానికి ఈ ధనస్సును వాడుకొనడం జరిగింది. ఎవరైతే శివధనస్సు నెత్తి బాణాన్ని సంధించ గలరో వారే సీతను పరిణయమాడుటకు అర్హులని ఆయన చాటింపు వేయించాడు. రాముడు శివధనస్సు నెత్తి ఎక్కుపెట్టడమే తరువాయి అది రెండుగా విరిగి పోయింది. దాంతో సీతా రాముల కల్యాణం జరిగి పోయింది. స్వయంవరం అయిపోయిన తరువాత సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య వెళుతున్న రాముని పరశురాముడు అడ్డగించాడు.

మూలాలు[మార్చు]

  1. http://www.valmikiramayan.net/bala/sarga31/bala_31_prose.htm వాల్మీకిరామాయణ్.నెట్