శీఘ్రస్ఖలనం
![]() | ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
శీఘ్రస్ఖలనం | |
---|---|
Specialty | మనోరోగచికిత్స, మానసిక శాస్త్రము ![]() |
శ్రీఘ్రస్ఖలనం ఒక రతి సంబంధిత జబ్బు. ఈ వ్యాధిలో అంగప్రవేశం చేసినవెంటనే వీర్యము పడిపోతుంది. తర్వాత అంగము మెత్తబడి దంపతులిద్దరికీ విపరీతమైన అసంతృప్తి కలుగుతుంది. శృంగారంలో పాల్గొన్న కొద్దిసేపటికే లేదా స్త్రీకి భావప్రాప్తి కలగకముందే వీర్యస్ఖలనం జరగటాన్ని శీఘ్రస్ఖలనంగా పేర్కొంటారు. శృంగారంలో ప్రారంభం నుంచి వీర్యస్ఖలనం అయ్యే వరకు పట్టే సమయం మూడు నిమిషాలలోపు ఉంటే శీఘ్రస్ఖలనం సమస్య ఉన్నట్లుగా భావించాలి[1]. పురుషుడి జీవితాన్ని అమితంగా కుదిపేసే అతిపెద్ద భయాల్లో శీఘ్రస్ఖలనం ఒకటి. పురుషుల్లో అత్యధికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య కూడా ఇదే. అల్లోపతి వైద్యం శీఘ్రస్ఖలన సమస్యకు మూలం మెదడులోనే ఉందని, మానసిక ఒత్తిళ్లే అతి పెద్ద కారణమని అదేపనిగా చెబుతూ ఉంటుంది. కానీ, అది నిజం కాదు. శీఘ్రసమస్య కారణాల్లో మెదడు కూడా ఒక భాగమే. కానీ, దానికి మించి హార్మోన్ సమస్యలు అతి పెద్ద కారణంగా ఉంటాయి. వాటితో పాటు కండరాలు, నరాలు, రక్తనాళాలు వీటన్నింటి భూమిక కీలకంగానే ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇటీవల జరిపిన పరిశోధనల్లో శీఘ్రస్ఖలన సమస్యకు నాడీవ్యవస్థలో అంతటా ఉండే సెర టోనిన్ పరిమాణం తగ్గడం ఒక ప్రధాన కారణమని తేలింది. ఈ వాస్తవాల్ని విస్మరించి చాలా మంది శీఘ్రస్ఖలన సమస్యకు మానసిక ఒత్తిళ్లే కారణమని చెబుతూ వస్తున్నారు.
కారణాలు[మార్చు]
ఆతురత ఉన్నవారికి
- శీఘ్రస్ఖలన సమస్యకు హార్మోనల్ లెవెల్స్‌లో తేడాలు, కెమికల్ (సెరటోని న్) లెవెల్స్‌లో తేడాలు, ఎజాకులేటరీ సిస్టమ్ లోని లోపాలు ఒక ప్రధాన కారణమవు తాయి.
- వంశానుగతంగా, జన్యుపరంగా వచ్చే మూలాలు కూడా శీఘ్రస్ఖలనానికి కారణమవుతాయి.
- శారీరక కారణాల్లో అంగం శీర్షంలో అతిగా స్పందిం చే లక్షణం ఒక కారణం.
- ప్రొస్ట్రేట్ వ్యాధులు ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది.
- యురెథ్రాలో వాపు గానీ, ఇన్‌ఫెక్షన్లు ఉన్నా ఈ సమస్య రావచ్చు. అంటే మూత్రాన్ని, శుక్రాన్ని తీసుకువచ్చే యూరేటరీ ట్యూబ్స్‌లో సమస్య ఉన్నా, యురెథ్రాలో సమస్య ఉన్నా ఈ సమస్య రావచ్చు.
- రక్తపోటు, మధుమేహం, అతి మద్యపానం వీటివల్ల కూడా శీఘ్రస్ఖలన సమస్య రావచ్చు.
- తరుచూ యాంటీడిప్రెసెంట్ మందులు వాడే వారిలో స్ఖలనం కాకుండా ఉండడం జరుగుతుంది
- వెన్నెముక బలంగా దెబ్బతిన్నా ఈ సమస్య రావచ్చు.
- హైపర్ లేదా హైపో థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా ఈ ఇబ్బంది రావచ్చు.
- ప్రమాదాల కారణంగా గానీ, శస్త్రచికిత్సల వల్ల గానీ, నరాలు దెబ్బతిన్నవారిలోనూ ఈ సమస్య రావచ్చు.
ఆయుర్వేద చికిత్స - శాశ్వత చికిత్స[మార్చు]
అల్లోపతిలో శీఘ్రస్ఖలనం అన్నది ఎప్పటికీ తొలగిపోని శాశ్వత వ్యాధి. ఆయుర్వేదంలో అది సంపూర్ణంగా తొలగిపోయే సమస్య. మౌలికంగా శీఘ్రస్ఖలనం అన్నది వాత వికృతి వల్ల తలెత్తే సమస్య. ఒకసారి వాతం ప్రకోపిస్తే అది పిత్తాన్నీ, కఫాన్నీ పెంచేస్తుంది. పిత్తం పెరిగితే లైంగిక వ్యవస్థ బలహీనపడుతుంది. లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. అంగ స్తంభనలు తగ్గిపోతాయి. అందువల్ల లైంగిక శక్తి బలంగా ఉండాలంటే వాతపిత్తక ఫాలు మూడూ సమతు ల్యంగా ఉండాలి. ఆ లక్ష్యంగానే ఆయుర్వేదం పనిచేస్తుంది. ఆయుర్వేదం శీఘ్రస్ఖలనాన్ని అరికట్టడ మే కాదు, గొప్ప లైంగిక నియంత్రణా శక్తినిస్తుంది. శృంగారంలో లోతైన ఆనందానికి పాత్రుల్ని చేస్తుంది. ఆయుర్వేదంలో అష్టాంగాలు అంటూ ఒక ఎనిమిది విభాగాలు ఉన్నాయి. వాటిలో లైంగిక విషయాలకే ప్రత్యేకించి వాజీకరణ తంత్రం ఉంది. ఇది సమస్త లైంగిక సమస్యలకు నివారణా మార్గాలను సూచించడంతో పాటు సంతాన లేమి సమస్యను కూడా పరిష్కరిస్తుంది.
శీఘ్రస్ఖలన సమస్య నివారణకు ఆయుర్వేదంలో వాతహర చికిత్సలు లభిస్తాయి. వాతపిత్తకఫాలు సామ్యావస్థకు చేరుకునే వైద్యం చేస్తారు. ఆ పైన వాజీకరణ చికిత్సలు చేస్తారు. ఇందులో వీర్యకణాల సంఖ్యను పెంచే విధానం కూడా ఉంటుంది. వీటితో పాటు లైంగిక పటిమను పెంచేవి, మానసిక సమస్యలను తొలగించేవి, శుక్రాన్ని శక్తివంతం చేసేవి ఇలా పలురకాల ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వాతపిత్తకఫాలు సామ్యావస్థకు చేరుకున్నప్పుడు సప్తధాతువులూ వృద్ధి చెందుతాయి. వైద్య చికిత్సలతో శుక్రంలో పుష్టి ఏర్పడితే శృంగారంలో పరిపూర్ణ ఆనందాన్ని పొందే స్థితి ఏర్పడుతుంది. కావాలనుకున్నవారికి ఈ సమస్యలన్నీ తొలగిపోయి సంతానప్రాప్తి కూడా కలుగుతుంది.
ఆయుర్వేద చికిత్సలతో సప్తధాతువుల్లోని చివరిదైన శుక్రం పరిపుష్టం కావడమే కాకుండా, ప్రాణవంతమైన ఓజస్సు కూడా వృద్ది చెందుతుంది. అయితే వాజీకరణాలు గానీ, రసాయనాలు గానీ తీసుకునే ముందు శరీరంలోని ఆమాన్ని, అంటే వ్యర్థ, విషపదార్థాలను సంపూర్ణంగా తొలగించుకోవాలి. అందుకు పంచకర్మ చికిత్సలు చేయించుకోవాలి. వీటన్నిటిద్వారా మొత్తంగా మీ లైంగిక శక్తి. కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ సర్వశక్తివంతంగా మారి, అవి తమ సహజశైలిలో పనిచేయడం మొదలెడతాయి. ఫలితంగా శీఘ్రస్ఖలన సమస్యకు ఇక ఎంతమాత్రం తావులేకుండా పోతుంది.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-27. Retrieved 2015-02-02.