సుప్తవజ్రాసనం
స్వరూపం
(శుప్తవజ్రాసనం నుండి దారిమార్పు చెందింది)
శుప్తవజ్రాసనం యోగాలో ఒక విధమైన ఆసనము.
ఆసనం వేయు విధానం
[మార్చు]- ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి.
- కుడి, ఎడమ మోచేతులను శరీరానికి ఇరువైపులా సమానంగా ఉండేలా నెమ్మదిగా వెనుకవైపు నేలమీద ఉంచాలి.
- మోచేతి భాగం నుంచి చేతి వ్రేళ్ల వరకు నిటారుగా ఉంచి నెమ్మదిగా శరీరాన్ని వెనుకకు వంచాలి.
- ఇప్పుడు భుజాలునేలను తాకుతూ ఉండాలి. ప్రాథమిక దశలో ఉన్నవారైతే రెండు చేతులను తొడలపై ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ చేతులను మోకాలివరకు సమానంగా తీసుకురావాలి.
- ఈ స్థితికి బాగా అలవాటు పడిన తర్వాత రెండు చేతులను కత్తెర ఆకారంలో ఉండేలా భుజాల కింద ఉంచాలి. కుడి చేయి ఎడమ భుజం కింద... అలాగే ఎడమచేయి కుడి భుజం కింద ఉంచాలి. రెండింటి మధ్య తలభాగం ఉండేలా చూసుకోవాలి.
- తిరిగి వాస్తవిక స్థితికి వచ్చే సమయంలో, మొదటగా రెండు చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి.
- తర్వాత మోచేతుల సాయంతో తొలుత ఉన్న స్థానానికి నిదానంగా వచ్చేయాలి.
గుర్తుంచుకోవలసినవి
[మార్చు]- మీ శరీరాన్ని వెనుకకు వంచే సమయంలో శరీర బరువును నియంత్రిస్తూ ఎలాంటి కుదుపులు లేకుండా నెమ్మదిగా చేయాలి. లేనిచో కండరాల నెప్పి వంటి సమస్యలు తలెత్తును.
- ఈ ఆసనాలు వేసేప్పుడు ఏదైనా కష్టంగా అనిపించినట్లు.. లేదా సమస్యగా అనిపించినట్లు ఉంటే.. యోగసాధకులు ఈ ఆసనాన్ని వెయ్యకపోవడమే మంచిది.
- ప్రాథమిక దశలో ఉన్న యోగసాధకులు... ఈ ఆసనంలో మోకాళ్లను దగ్గరగా ఉంచుకోవటం కష్టమనిపిస్తే కాస్త దూరదూరంగానైనా ఉంచుకోవచ్చు.
ప్రయోజనాలు
[మార్చు]- ఉదరసంబంధిత కండరాలను చైతన్య పరుచును.
- తుంటి నొప్పి, అధికరక్తపోటు వంటి సమస్యలు ఉన్న వారికి ఈ ఆసనం సాయపడును.
- మలబద్ధకము వంటి సమస్యలకు ఈ ఆసనం ఉత్తమం.
జాగ్రత్తలు
[మార్చు]తొడ యొక్క పైభాగములో నొప్పి, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు గలవారు ఈ ఆసనాన్ని చేయరాదు.