కత్తెర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివిధరకాల కత్తెరలు.

కత్తెర (Scissors) ఏదైనా వస్తువును కావలసిన ఆకారంలో ముక్కలు చేయడానికి ఉపయోగించే పరికరం. దీనిని ఇనుముతో కాని ఉక్కుతో కాని, ఇత్తడితో కాని తయారు చేస్తారు. దీనిని ప్రపంచమంతటా ప్రతివారూ ఉపయోగిస్తుంటారు.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో కత్తెర పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] కత్తెర [ kattera ] kattera. [Tel.] n. Scissors. The constellation or sign called కృత్తిక. The period of time when the sun is between the signs భరణి, రోహిణి and కృత్తిక. కత్తెర కాలు kattera-kālu. n. The upright cross pieces of wood in a dooly or litter, that connect the bottom with the pole above. కత్తెరగడ్డము kattera-gaddamu. n. A cropped beard. కత్తెరగాయము kattera-gāyamu. n. A certain kind of window గవాక్ష విశేషము. కత్తెరచీల kattera-chīla. n. A pin on which a lever acts. మీట ఆడే చీల. కత్తెరదొంగ kattera-donga. n. A cut purse. కత్తెరబావిలీలు kattera-bāvilīlu. n. An ornament of gold and gems worn by women near the top of the ear. కత్తెరయెండ kattera-yeṇḍa. n. Fierce heat. కత్తెరరాయ kattera-rāyi. n. Marble; a kind of black stone, which is sonorous like metal. కత్తెరవాసములు kattera-vāsamulu. n. Bamboos arranged against each other like the blades of scissors.

తయారీ పద్దతులు

[మార్చు]

దీని తయారీకి రెండు ఒకేరకమైన మూసలో ఉన్న చిన్న పలుచని ఇనుము లేదా స్టీల్ ముక్కలు వాడుతారు. వాట్ ఒకవైపు అంచులను పదును పెట్టి వాటిని మధ్యభాగమున చిన్న రంద్రము చెసి రెండిటిని కలుపుతూ ఒక బోల్టు పెట్టి బిగిస్తారు. పట్టుకొనేందుకు వీలుగా రెండిటికీ ఒక వైపు దలసరిగా ప్లాస్టిక్ తొడుగులు తొడుతారు.

ఉపయోగాలు

[మార్చు]

దీని ఉపయోగం పలు సంధర్భాలలో సర్వసాధరణం. కనుక ఇది ప్రతి గృహంలోనూ కనిపిస్తుంటుంది. దీని ఉపయోగాలలో కొన్ని.

  • దీనిని సర్వసామాన్యంగా టైలర్(Tailer) అని పిలిచే దర్జీ పనివారు తప్పక ఉపయోగిస్తారు.
  • బట్టను కత్తిరించి దుస్తులుగా మలచే పనిలో కత్తెర ముఖ్యమైన సాధనం.
  • ఆఫీసులలో, ఇతర కార్యాలయాలలో ఉద్యోగులు పేపరు కత్తిరించుకొనుటకు వినియోగిస్తారు.
  • ఇంటి ముందు తోటలో రెండు చేతులతో వాడె పెద్ద కత్తెరతో చెట్లను అందంగా వుండుటకు కత్తరిస్తారు.
  • మంగలి తల వెంట్రుకలను కత్తరించడానికి కత్తెరను వుపయోగిస్తాడు.
  • వైద్యులు శస్త్ర చికిత్సలో చిన్న కత్తెరలను ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం కత్తెర పదప్రయోగాలు". Archived from the original on 2016-01-25. Retrieved 2010-01-12.
"https://te.wikipedia.org/w/index.php?title=కత్తెర&oldid=2822023" నుండి వెలికితీశారు