శృతి సోధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శృతి సోధీ
జననం (1989-11-23) 1989 నవంబరు 23 (వయసు 34)
ఇతర పేర్లుశృతి
వృత్తినటి

శృతి సోధీ, ఢిల్లీకి చెందిన సినిమా నటి. పంజాబీ, తెలుగు సినిమాలలో నటించింది.[1][2]

జననం, విద్య

[మార్చు]

శృతి సోధీ 1989, నవంబరు 23న ఢిల్లీలో జన్మించింది. న్యూఢిల్లీలో చదువుకున్న శృతి, తత్వశాస్త్రంలో డిగ్రీని పొందింది.[3]

కెరీర్

[మార్చు]

ప్రారంభంలో శృతి రెండు హిందీ ఛానల్స్‌లో న్యూస్ యాంకర్‌గా పనిచేసింది.[4] 2015 జనవరిలో విడుదలైన పటాస్ సినిమాలో నటించింది.[5][6] హ్యాపీ గో లక్కీ,[7] మిస్టర్ & మిసెస్ 420, వైశాఖి లిస్ట్, దిల్ విల్ ప్యార్ వ్యార్ వంటి నాలుగు పంజాబీ సినిమాలలో కూడా నటించింది.[8]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2014 హ్యాపీ గో లక్కీ జాస్ పంజాబీ అరంగేట్రం
దిల్ విల్ ప్యార్ వ్యార్ జాస్
మిస్టర్ & శ్రీమతి 420 జస్మీత్
2015 పటాస్ మహతి తెలుగు
2016 వైశాఖి లిస్ట్ ఒక మనిషి పంజాబీ
సుప్రీం హీరోయిన్ తెలుగు ఓ పాటలో స్పెషల్ అప్పియరెన్స్
మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రియా
2017 బడ్డీస్ ఇన్ ఇండియా ప్రిన్సెస్ ఐరన్ ఫ్యాన్ మాండరిన్
2021 వాడు నేను కాదు తెలుగు చిత్రీకరణ

మూలాలు

[మార్చు]
  1. Shruti Sodhi to play a journalist in Kalyanram's film – Times of India. Timesofindia.indiatimes.com (1 November 2014). Retrieved on 2022-04-14.
  2. Jyotii Sethi to debut in Tollywood – Times of India. Timesofindia.indiatimes.com (9 January 2015). Retrieved on 2022-04-14.
  3. Shruti Sodhi has a degree in philosophy – Times of India. Timesofindia.indiatimes.com (21 January 2015). Retrieved on 2022-04-14.
  4. Fashion Tips And Trends Archived 2015-07-01 at the Wayback Machine. Fashion.myntra.com. Retrieved on 2022-04-14.
  5. Meet Shruti Sodhi, the Patas girl. Deccanchronicle.com. Retrieved on 2022-04-14.
  6. Kalyanram, Shruti Sodhi groove for a remix song in Pataas – Times of India. Timesofindia.indiatimes.com (7 November 2014). Retrieved on 2022-04-14.
  7. Isha Rikhi: Amrinder Gill is a very supportive co-actor – Times of India. Timesofindia.indiatimes.com. Retrieved on 2022-04-14.
  8. Gurdaas Maan and Neeru Bajwa in Dil Vil Pyar Vyar – Times of India. Timesofindia.indiatimes.com. Retrieved on 2022-04-14.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శృతి_సోధీ&oldid=3555610" నుండి వెలికితీశారు