శైలిక
శైలికలు (Cilium; pleural: Cilia) కొన్ని సూక్ష్మజీవుల చలనాంగాలు. ఇవి కొన్నిజీవకణాలలో బయటకు పొడుచుకొని వచ్చే సుక్ష్మ నిర్మాణము. ప్రోటోజోవా వర్గంలోని సీలియేటా (Ciliata) విభాగానికి చెందిన జీవులు ఈ రకమైన చలనాన్ని ప్రదర్శిస్తాయి.
శైలికలలో రెండు రకాలు: కదిలే శైలికలు (motile cilia) : ఇవి ఒకే దిక్కుగా కదుల్తాయి. కదలని లేదా ప్రాథమిక శైలికలు (non-motile or primary cilia) కదలిక లేనివి. ప్రాథమిక శైలికలు జీవకణానికి ఏంటిన్నాలాగా పనిచేసి బయటనుండి సంకేతాలను గ్రహిస్తాయి."[1]
శైలికా చలనం
[మార్చు]శైలికల అమరిక, వాటి చలనం కూడా క్రమబద్దంగా ఉంటుంది. శైలికల కదలిక ఆయత అక్షానికి లంబకోణం ( Right Angle) లో ఉంటుంది. ఇది నిర్ణీతకాల వ్యవధులలో మారుతూ ఉంటుంది. ఈ చలనాన్ని ప్రకంపనం (Vibration), డోలక చలనం (Oscillatory movement), తెడ్డువేత కదలిక (Rowing movement) అని అంటారు. ఈ చలనాన్ని రెండు దశలుగా విభజించవచ్చును. మొదటిది క్రియాదశ. ఈ దశలో శైలిక పటిష్ఠంగా ఉండి హెచ్చు శక్తితో పరిసర ద్రవం మీద ఆఘాతం లేదా దెబ్బను వేస్తుంది. ఫలితంగా ద్రవం కదలి, జీవి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. రెండవ యధాస్థితి దశలో (Recovery stroka) లో శైలిక ఆధారభఅగం వెనుకకు వంగటం ప్రారంభిస్తుమ్ది. ఈ వంపుదేరటం క్రమమ్గా శైలిక అంత్యానికి విస్తరించి శైలిక తిరిగి దృఢంగా అవుతుంది. మళ్ళీ క్రియాదశ మొదలవుతుంది. ఈ విధంగా శైలికలు ఒకే సమయంలో ఒకే దిశలో చలించడాన్ని ఏకకాలిక లయ అంటారు.
మూలాలు
[మార్చు]- ↑ Satir, Peter; Søren T. Christensen (2008-03-26). "Structure and function of mammalian cilia". Histochemistry and Cell Biology. 129 (6). Springer Berlin / Heidelberg: 687–693. doi:10.1007/s00418-008-0416-9. 1432-119X. Retrieved 2008-06-17.[permanent dead link]