శోద్
స్వరూపం
శోద్ | |
---|---|
దర్శకత్వం | బిప్లాబ్ రాయ్ చౌదరి |
రచన | సునీల్ గంగోపాధ్యాయ (కథ) బిప్లాబ్ రే చౌదరి (స్క్రీన్ ప్లే) హృదయేశ్ పాండేయ (మాటలు) |
నిర్మాత | సీతాకాంత్ మిశ్రా |
తారాగణం | ఓం పురి కను బందోపాధ్యాయ హేమంత దాస్ సుషామా టెండూల్కర్ |
ఛాయాగ్రహణం | రాజన్ కినగి |
కూర్పు | బిప్లాబ్ రాయ్ |
సంగీతం | శాంతను మహాపాత్ర |
నిర్మాణ సంస్థ | కళింగ ఫిల్మ్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 1979 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
శోద్, 1979లో విడుదలైన హిందీ హర్రర్ సినిమా. సీతాకాంత్ మిశ్రా నిర్మించిన ఈ సినిమాకు బిప్లాబ్ రాయ్ చౌదరి దర్శకత్వం వహించాడు.[1] సునీల్ గంగోపాధ్యాయ రచించిన గోరోమ్ భట్ ఓ నిచోక్ భూటర్ గొప్పో (స్టీమింగ్ రైస్ అండ్ ఎ గోస్ట్ స్టోరీ) అనే బెంగాలీ పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఓంపురి, కను బందోపాధ్యాయ, హేమంత దాస్, సుషామా టెండూల్కర్ నటించారు.[2]
కథా నేపథ్యం
[మార్చు]యుక్తవయసులో తన గ్రామం నుండి బహిష్కరించబడిన సురేంద్ర (ఓం పురి) నగరంలో నివసిస్తుంటాడు. తన తండ్రి మరణించాడని తెలిసి మళ్ళీ గ్రామానికి తిరిగి వస్తాడు. తనకు దెయ్యాన్ని చూపించిన వారికి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఆకలితో ఉన్న పేద రైతులు ఆ పనికి పూనుకుంటారు. ఫలితంగా అమాయక ప్రజలను నష్టాలు వెంటాడుతుంటాయి. హత్యలు కూడా జరుగుతాయి.
నటవర్గం
[మార్చు]- ఓం పురి (సురేంద్ర)
- కను బందోపాధ్యాయ
- హేమంత దాస్
- సుషామా టెండూల్కర్
- బంకిమ్ ఘోష్
- తపతి భట్టాచార్య
- సాషి సక్సేనా
- పూర్ణిమ దేవి
- ఉదయ్ చంద్ర
- వినయ్ ఆప్టే
- మోను ముఖర్జీ
- అనంత్ మహాపాత్ర
- జోతిన్ బుద్ధాదేవ్ జైస్వాల్
- శాంతి
అవార్డులు
[మార్చు]- 1980 - ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- 1980 - ఉత్తమ సినిమాటోగ్రఫీకి జాతీయ చిత్ర పురస్కారం - రాజన్ కినగి
మూలాలు
[మార్చు]- ↑ "Shodh (1980)". Indiancine.ma. Retrieved 2021-06-17.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi cinema. Popular Prakashan. p. 337. ISBN 81-7991-066-0.