Jump to content

సునీల్ గంగోపాధ్యాయ

వికీపీడియా నుండి
సునీల్ గంగోపాధ్యాయ
సునీల్ గంగోపాధ్యాయ చిత్రము
పుట్టిన తేదీ, స్థలం(1934-09-07)1934 సెప్టెంబరు 7
ఫరీద్ పూర్, బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది)
మరణం2012 అక్టోబరు 23(2012-10-23) (వయసు 78)
కోల్ కత, పశ్చిమ బెంగాల్
సమాధి స్థానంN/A
కలం పేరునీల్ లోహిత్, సనాతన్ పాఠక్, నీల్ ఉపాధ్యాయ్[1]
వృత్తిరచయిత
భాషబెంగాలీ
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతీయుదు
విద్యఎం.ఎ (బెంగాలీ సాహిత్యం)
పూర్వవిద్యార్థికలకత్తా విశ్వవిద్యాలయం (1954)
కాలం1953–2012
గుర్తింపునిచ్చిన రచనలుఫస్తు లైట్ (మొదటి కాంతి), దోస్ డేస్ (ఆ రోజులు), ఈస్ట్ అండ్ వెస్ట్ (తూర్పు పడమర), కాకాబాబు
పురస్కారాలుఆనంద పురస్కారం (1972, 1989)
సాహిత్య అకాడమీ పురస్కారం (1985)
జీవిత భాగస్వామి
స్వాతి బందోపాధ్యాయ్
(m. 1967)
సంతానంసోవిక్ గంగోపాధ్యాయ (b. 1967)

సంతకంSunil Gangopadhyay signature in Bengali

సునీల్ గంగోపాధ్యాయ ముఖ బెంగాలీ సాహితీవేత్త, సాహిత్య అకాడమీ ఆధ్యక్షుడు. బెంగాలీ సాహిత్యంపై చెరగని ముద్రవేసిన ఆయన ఐదు తరాల బెంగాలీ రచయితలకు వారధిగా నిలిచారు. కవిత, కథ, నాటకం లాంటి వివిథ రకాల ప్రక్రియల్లో తనదైన ముద్రని చూపించారు. గంగోపాధ్యాయ రచనల్ని కథావస్తువులుగా తీసుకుని కొన్ని సినిమాలు కూడా తీశారు.

జీవిత విశేషాలు

[మార్చు]

తూర్పు బెంగాల్ లోని ఫరీదా పూర్ లో 1934 సెప్టెంబర్ ఏడో తేదీన సునీల్ జన్మించారు. కోల్ కతాలోని డమ్ డమ్ మోతీజీల్ కాలేజీ, సురేంద్రనాథ్ కాలేజీ, సిటీ కాలేజీల్లో విద్యాభ్యాసం చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో బెంగాల్ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. చాలా కొద్ది కాలంలోనే శక్తిమంతమైన కవిగా, రచయితగా, నవలాకారుడిగా, నాటకకర్తగా గుర్తింపు పొందారు. కవితా ప్రక్రియ అంటే సునీల్ గంగోపాధ్యాయకి ప్రాణం. క్రిత్తిబాస్ అనే పత్రికను స్థాపించి కొత్త రచయితల్ని బాగా ప్రోత్సహించారు సునీల్ గంగోపాధ్యాయ. 1985లో సెయ్ సమయ్ నవలకు సాహిత్య అకాడెమీ అవార్డ్ ని అందుకున్నారు.[2]

అవార్డులు

[మార్చు]

ఆయన 1985లో సాహిత్య అకాడమీ అవార్డును గెలు పొందారు. ఆనంద పురస్కా రాన్ని 1989లో, హిందూ సాహిత్య పురస్కారం 2011 లో అందు కున్నారు.[3]

సునీల్ గంగోపాధ్యాయ స్మారక పురస్కారం

[మార్చు]

బెంగాలీ సాహిత్యరంగంలో సుప్రసిద్ధుడైన గంగోపాధ్యాయ అనేక నవలలు, కవిత్వంతో పాటు విభిన్న సాహిత్య ప్రక్రియల్లో సుమారు 200 పుస్తకాలు వెలువరించారు.

గంగోపాధ్యాయ రాసిన రెండు నవలలను ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే సినిమాలుగా రూపొందించారు. గోరోమ్ భట్ ఓ నిచోక్ భూటర్ గొప్పో (స్టీమింగ్ రైస్ అండ్ ఎ గోస్ట్ స్టోరీ) అనే బెంగాలీ పుస్తకం ఆధారంగా దర్శకుడు బిప్లాబ్ రాయ్ చౌదరి శోద్ అనే సినిమా తీశారు. గంగోపాధ్యాయ స్మృత్యర్థం కోల్‌కతాకు చెందిన ‘ది బెంగాల్’ సంస్థ ఈ అవార్డును 2012లో నెలకొల్పింది. పురస్కార గ్రహీతలకు రెండు లక్షల రూపాయల చొప్పున నగదును కూడా బహూకరిస్తారు. సునీల్ గంగోపాధ్యాయ స్మారక పురస్కారాలను ప్రముఖ బెంగాలీ కవులు నీరేంద్రనాథ్ చక్రవర్తి, శంఖ ఘోష్‌లకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 11,2014న అందజేశారు. సునీల్ గంగోపాధ్యాయ స్మారక పురస్కారాన్ని 2012 సంవత్సరానికి గాను నీరేంద్రనాథ్, 2013కు గాను శంఖ ఘోష్ అందుకున్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Bengali writer Sunil Gangopadhyay dies of a heart attack at 78". IBNLive. 23 October 2012. Archived from the original on 23 October 2012. Retrieved 23 October 2012.
  2. "బెంగాలీ కవి సునీల్ గంగోపాధ్యాయ మృతి". Archived from the original on 2016-03-05. Retrieved 2015-07-27.
  3. "ప్రముఖ సాహితీవేత్త సునీల్‌ గంగోపాధ్యాయ కన్నుమూత". Archived from the original on 2016-03-04. Retrieved 2015-07-27.
  4. "సునీల్ గంగోపాధ్యాయ స్మారక పురస్కారాలను ప్రధానం చేసిన రాష్ట్రపతి". Archived from the original on 2016-03-05. Retrieved 2015-07-27.

ఇతర లింకులులు

[మార్చు]