శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం (వింజమూరు)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామంలో ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం ఈ గ్రామానికి చుట్టుప్రక్కల గ్రామాలలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో ప్రతిరోజు అర్చకులు పూజలు చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ చుట్టుప్రక్కల గ్రామాలలోని జంటలకు జరిపించే సామూహిక వివాహాలను ఈ దేవాలయంలో నిర్వహిస్తారు. మామూలు రోజులలో కూడా ఇక్కడ వివాహాలు జరుగుతుంటాయి. ముఖ్యమైన పండుగ రోజులలో స్వామి వారు గ్రామోత్సవానికి విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా తిరునాళ్ళను నిర్వహిస్తారు.
శ్రీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు
[మార్చు]ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి తరువాత శ్రీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవములు ప్రారంభమవుతాయి. ఇవి 9 రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతవి.
దేవాలయ చరిత్ర
[మార్చు]పలనాటి పౌరుషవంతులైన రాజవంశాలకు కులదైవంగా శ్రీ చెన్నకేశవస్వామి కొలువుదీరిన ఆలయమిది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని కడప ఓబులరెడ్డిగారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణం జరిపారు. (ఈనాడు,30 అక్టోబరు 2013)
-
శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం
-
ఆళ్వారుల విగ్రహాలు ఉండే ఆలయ గది
-
ప్రధాన గోపురం లోపలి వైపు నుంచి
-
వినాయకస్వామి
-
ధ్వజస్తంభం
-
శిలాఫలకం
-
శిలాఫలకం
-
ధ్వజస్తంభం
-
దేవాలయంలో ఉన్న తులసి మొక్క
-
శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం