శ్రీనివాస చక్రవర్తి (ఆచార్యులు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీనివాస చక్రవర్తి ఐఐటీ మద్రాసు లో న్యూరోసైన్సు విభాగంలో ఆచార్యుడు. ఆయనకు విజ్ఞాన శాస్త్రం అంటే ఆసక్తి. దానిని తెలుగులో ప్రచారం చేయడం కోసం అనేక పుస్తకాలు రచించాడు. శాస్త్ర విజ్ఞానం అనే పేరిట ఓ బ్లాగును కూడా నిర్వహిస్తున్నాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన స్వస్థలం విశాఖపట్టణం. మద్రాసు ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్, పీ.హెచ్.డీ చేశాడు. ఇందుకోసం ఎనిమిదేళ్ళు అమెరికాలో ఉన్నాడు. పరిశోధన కోసం అనేక దేశాలు తిరిగాడు. స్వతహాగా పుస్తక ప్రియుడు కావడం వలన ఆయా ప్రదేశాలలో గ్రంథాలయాలను సందర్శించాడు. అక్కడి విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు ఆసక్తికరంగా ఉండటం గమనించాడు. తెలుగులో కూడా అలాంటి పుస్తకాలు అందుబాటులో ఉంటే విద్యార్థులు చిన్నప్పటి నుండే అలాంటి పుస్తకాలు చదివి మంచి శాస్త్రవేత్తలు కాగలరని ఆశించి తన బ్లాగు ద్వారా పుస్తకాల ద్వారా రచనలు ప్రారంభించాడు.

2008 నుంచి ఆయన ఈ బ్లాగును నిర్వహిస్తున్నాడు. సుమారు ఆరు వందల మంది ఈ బ్లాగుతో అనుసంధానమై ఉన్నారు. ఇందులో దాదాపు 950 దాకా ఇతర భాషల్లోంచి తెలుగులోకి అనువదించిన విజ్ఞానశాస్త్ర వ్యాసాలు, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం ఐఐటీ మద్రాసు లో న్యూరోసైన్సు విభాగంలో ఆచార్యుడిగా పనిచేస్తున్నాడు. [1]

మూలాలు[మార్చు]

  1. మహ్మద్, షరీఫ్ (Feb 2016). తెలుగువెలుగు. తెలుగు వెలుగు. p. 18. Archived from the original on 1 May 2016. Retrieved 22 April 2016.

బయటి లింకులు[మార్చు]