శ్రీరామదండు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
శ్రీరామదండు మొదటి పేజీ

శ్రీరామదండు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్య సమరంలో స్థాపించిన యువసేన. ఇతడు శ్రీరాముని భక్తుడు. చేసిన పనులన్నీ రామాంకితం చేసిన ధన్యజీవి. భారత స్వతంత్ర పోరాటానికి సేవాదళములను సమకూర్చు సమయమున ఆంధ్ర సాంప్రదాయకంగా శ్రీరామదండు అను సంస్థను స్థాపించి 'బహుపరాక్' అను హెచ్చరికలను జేయుచు దానికి సంబంధించిన నిబంధనములను గ్రంథస్థము చేసెను. ఈతని చర్యలు కాంగ్రెస్ మహనీయులకు అసలు రుచించలేదు. ఇతడు వందలకొలదిగ ఉపన్యాసములను ఇచ్చినను, నెలలుగా చీరాలలో తన ఉద్యమమును నడిపించినను అతని హెచ్చరికలు, వ్రాతలు తప్ప రామదండు వర్ణన పత్రికలయందు కానరాదు. అందువలన పత్రికాముఖముగ లభ్యమైన శ్రీరామదండునకు సంబాంధించిన వ్రాతలన్నియు 1934లో గ్రంథస్థము చేసి సమకూర్చిరి.

మూలము[మార్చు]

  • శ్రీరామదండు: రామదాసు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ప్రకాశాకులు: శ్రీమదాంధ్ర విద్యాపీఠగోష్ఠి, విజయవాడ, 1934.