శ్రీలక్ష్మి రేబాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీలక్ష్మి రేబాల ప్రముఖ రంగస్థల నటి.

జననం[మార్చు]

ఈమె 1957 జూలై 12వ తేదీన డా. చయనం వెంకటసుబ్బారావు, దుర్గాంబ దంపతులకు గుంటూరు లో జన్మించింది.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

7 సంవత్సరాల వయస్సు నుండి 17 సంవత్సరాల వరకు భరతనాట్య ప్రదర్శనలిచ్చింది. బెల్లంకొండ సూర్యప్రకాశరావు రచనకు పి. దాసు దర్శకత్వం వహించిన ‘విధికృతం’ నాటకంతో వీరి నట జీవితానికి అంకురార్పణ జరిగింది. ఆ తదుపరి తెలుగు రాష్ట్రాలలోనేకాక ఇతర రాష్ట్రాలలో కూడా అనేక నాటక ప్రదర్శనల్లో పాల్గొని ఎన్నో బహుమతులను పొందింది.

1976 లో ‘కళాప్రవీణ’ రేబాల రమణ తో వివాహమయ్యాక ‘పల్నాటి యుద్ధం’ నాటకంలో ఈవిడ మాంచలగా రేబాల రమణ నాగమనాయకురాలుగా శతాధిక ప్రదర్శనలిచ్చారు. బాలనాగమ్మ, చింతామణి, చంద్రమతి, శశిరేఖ, పార్వతి, దాక్షాయణి, మోహిని, సత్యభామ, తార, వరూధిని, హిమబిందు, రాధ, పద్మావతి, లక్ష్మి, ద్రౌపది, శాంతిమతి, రుక్మిణి, మేరిమాత ఇలా ఎన్నో పాత్రలను పోషించింది.

1948 నుండి 1996 వరకు ప్రజానాట్యమండలి ప్రదర్శనల్లో పాల్గొన్నది. జన విజ్ఞాన వేదిక, శాస్త్ర కళాజాతా, అక్షర కళాయాత్రా జిల్లా కమిటీ సభ్యురాలుగా ఉంటూ ప్రదర్శనలు ఇవ్వడమేగాక, శిక్షణ శిబిరాలలోకూడా కళాకారులకు నృత్యం, నటనలో శిక్షణ ఇచ్చింది.

నటించినవి: సంస్మృతి, తప్పెవరిది, ఇదేనాదారి, యుగసంధి, జాగృతి, కళ్ళు, సమిధ, శిథిలశిల్పం, కనకపుష్యరాగం, మండువాలోగిలి, ఎర్రమట్టి, పంజరంలో పక్షులు, పల్లెపడుచు, గాలివాన, మరోమొహంజదారో, చిల్లరకొట్టు చిట్టెమ్మ మొదలగు సాంఘిక నాటిక/నాటకములలో నటించింది.

రేడియో నాటకాల్లో కూడా నటించింది.[1]

మూలాలు[మార్చు]

  • శ్రీలక్ష్మి రేబాల, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 104.
  • మాగంటి. "పండగరోజు నాటకం". www.maganti.org. Retrieved 5 April 2017.