శ్రీ తిలభాండేశ్వర్ మహాదేవ్ మందిర్
శ్రీ తిలభాండేశ్వర్ మహాదేవ్ మందిర్ | |
---|---|
श्री तिलभांडेश्वर महादेव मंदिर | |
వారణాసి మ్యాప్‌లో ఆలయ స్థానం | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 25°18′11″N 83°00′11″E / 25.302926°N 83.003061°E |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | వారణాసి |
ప్రదేశం | బెంగాలీ తోలా, భేలుపూర్, వారణాసి |
ఎత్తు | 84.660 మీ. (278 అ.) |
సంస్కృతి | |
దైవం | శివుడు |
ముఖ్యమైన పర్వాలు | మహాశివరాత్రి నాగపంచమి నవరాత్రి మకర సంక్రాంతి |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 18వ శతాబ్దం |
శ్రీ తిలభాండేశ్వర్ మహాదేవ్ మందిర్ (హిందీ: श्री तिलभांडेश्वर महादेव मंदिर), వారణాసిలోని అత్యంత పురాతనమైన, అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయానికి హిందూ ధర్మంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. తిలభాండేశ్వర మందిరం 18వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు.[1]
చరిత్ర
[మార్చు]శ్రీ తిలభాండేశ్వర్ మహాదేవ్ మందిర్ 18వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. బెంగాలీ తోలా ఇంటర్ కాలేజ్ (భేలుపూర్, వారణాసి) పక్కనే పాండే హవేలీలో ఉంది. ఆలయంలోని శివలింగం 2,500 సంవత్సరాల క్రితం స్వయంగా ఉద్భవించిందని, ప్రతి సంవత్సరం ఒక "టిల్" (హిందీ: तिल; అంటే నువ్వుల గింజ) పరిమాణం పెరుగుతుందని నమ్ముతారు. ప్రస్తుతం శివలింగం ఎత్తు 3.5 అడుగులు, లింగపీఠం (ఆధారం) వ్యాసం సుమారు 3 అడుగులు. శారదా మాత ఈ ఆలయంలో కొన్ని రోజులు గడిపినట్లు కూడా నమ్ముతారు.[1][2]
స్థానం
[మార్చు]శ్రీ తిలభాండేశ్వర్ మహాదేవ్ మందిర్, పాండే హవేలీ, భేలుపూర్‌లో, బెంగాలీ తోలా ఇంటర్ కాలేజీకి ఆనుకుని, గంగా నదికి తూర్పున 500 మీటర్లు, బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉత్తరాన 3.2 కిలోమీటర్లు, శ్రీ కాశీ విశ్వనాథ్ మందిరానికి నైరుతి దిశలో 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Temple information". Varanasi.org. Retrieved 3 March 2015.
- ↑ "History". Temples of Bharat. Retrieved 3 March 2015.