శ్రీ వింజేటమ్మతల్లి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వింజేటమ్మ అనగా వింజమూరు గ్రామానికి గ్రామ దేవత. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా లోని ఒక మండల కేంద్రం. పార్వతీదేవి మరొక నామమే వింజేటమ్మతల్లి. వింజమూరు గ్రామానికి దక్షిణం దిక్కున గల కొండపై వెలసియున్న శ్రీ వింజేటమ్మతల్లి దేవాలయం చాలా ప్రాచీనమైనది. ఈ కొండ వద్ద ఎవరు నివాసం లేనప్పటికి ఈ కొండ చుట్టూ ఉన్న ఎనిమిది గ్రామాలతో కలిపి కొండ తొమ్మిది పల్లెలుగా ప్రసిద్ధి పొందింది.

శివరాత్రి పర్వదినాన శ్రీ వింజేటమ్మతల్లి దేవాలయం

శ్రీ పరంజ్యోతి స్వామి[మార్చు]

కొండ పైన శిథిలమైన దేవాలయం వద్ద తాత్కాలిక పూజలు నిర్వహిస్తున్న దృశ్యం
కొండ కింద గల దేవస్థానం వద్ద నీటి పంపు

ఎంతోకాలం పాటు ఆగిపోయిన పూజా కార్యక్రమాలను శ్రీ పరంజ్యోతి స్వామి వారు పున:ప్రారంభించారు.

నూతన నిర్మాణం[మార్చు]

కొండపైన, కొండ కింద ఉన్న దేవాలయాలు శిథిలమై పోవడంతో కొండ కింద దాతల సహాయంతో నూతన దేవాలయాన్ని నిర్మించారు.

నాగులపుట్ట[మార్చు]

శ్రీ వింజేటమ్మతల్లిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా నాలుగు వేపచెట్ల మధ్య ఉన్న నాగులపుట్టను దర్శిస్తారు.

వరాల కల్పవల్లి[మార్చు]

ఇక్కడకి వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతుండటంతో శ్రీ వింజేటమ్మతల్లిని వరాల కల్పవల్లి శ్రీ వింజేటమ్మతల్లిగా అభివర్ణిస్తున్నారు.

అన్నదానం[మార్చు]

ఇక్కడ ప్రతి శుక్రవారం, పండుగలకు ప్రత్యేక సందర్భాలలో అన్నదానం జరుగుతుంది.

ఈ కొండ వద్ద జరిగే ఉత్సవాలు[మార్చు]

శివరాత్రి, దసరా, శ్రీ వింజేటమ్మతల్లి తిరునాళ్ళ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

ఈ కొండపై చూడదగినవి[మార్చు]

ఆహ్లాదకరమైన ప్రకృతి
గబ్బిలాల గుహ వద్ద ఉన్న శివలింగం

పురాణాల ప్రకారం[మార్చు]

హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తిరిగి యదాస్థానంలో ఉంచడానికి తీసుకుని వెళ్తున్న సమయంలో ఒక పెళ్ల విరిగి ఇక్కడ పడిందని పెద్దలు చెప్పుతుంటారు.

రవాణా సౌకర్యాలు[మార్చు]

వింజమూరుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో గల ఈ కొండ వద్దకు శుక్రవారం, పర్వదినములలో చుట్టుప్రక్కల గ్రామాలలోని భక్తులు నడచి, సొంత, బాడుగ వాహనాలలో ఇక్కడికి వస్తుంటారు.

సౌకర్యాలు[మార్చు]

ఇక్కడ వసతి గృహములు లేనందువలన ఇక్కడకి వచ్చిన భక్తులు సాయంత్రానికి తిరిగి వెళ్తుంటారు.