శ్రీ శ్రీనివాస నాట్యమండలి, నెల్లూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ శ్రీనివాస నాట్యమండలి 1976 లో నెల్లూరులో స్థాపించబడినది. దీని వ్యవస్థాపక కార్యదర్శి తిరుపతి హరగోపాల్.

వీరు ఈ మూడు దశాబ్దాల కాలంలో ఆంధ్ర రాష్ట్రమంతా పర్యటించి ఎన్నో నాటక ప్రదర్శనల్ని ఇచ్చారు. వీరు ప్రదర్శించిన వాటిలో అన్నమాచార్య, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, శ్రీ గణపతి మహత్యం ముఖ్యమైనవి. వీనిలో అన్నమయ్యగా నటించిన హరగోపాల్ కు అభినవ అన్నమయ్యగా గుర్తింపు లభించింది.

  1. అన్నమాచార్య నాటకానికి 1999లో ఉత్తమ బాలనటుడిగా నంది నాటక పురస్కారం లభించింది.
  2. శ్రీ వీరభ్రహ్మేంద్రస్వామి చరిత్ర నాటకానికి 2002లో ఉత్తమ సంగీతానికి నంది నాటక పురస్కారం లభించింది.
  3. శ్రీ గణపతి మహత్యం నాటకానికి 2003 లో జ్యూరీ నుండి నంది నాటక అవార్డు లభించింది. .