అక్షాంశ రేఖాంశాలు: 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యనారాయణ స్వామి దేవాలయం
సూర్యనారాయణ స్వామి దేవాలయం is located in Andhra Pradesh
సూర్యనారాయణ స్వామి దేవాలయం
సూర్యనారాయణ స్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లొ ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
పేరు
ప్రధాన పేరు :సూర్యనారాయణ స్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:తూర్పు గోదావరి
ప్రదేశం:బిక్కవోలుగొల్లల మామిడాడ
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సూర్యనారాయణ స్వామి దేవాలయం
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:1902

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా, గొల్లల మామిడాడ గ్రామములో ఉన్న దేవాలయము.

ఆలయం చరిత్ర

[మార్చు]

ఈ సూర్యదేవాలయాన్ని 1902లో శ్రీ కొవ్వూరి బసివిరెడ్డి గారు నిర్మించాడు. 1897లో బ్రిటీష్ మహారాణి ఇచ్చిన పత్రం ఇప్పటికీ వుంది. సూమారు వంద సంవత్సరాల చరిత్ర గల ఈ సూర్యనారాయణస్వామి ఆలయముఖ ద్వారంలో వున్న ద్వారపాలకుల విగ్రహములు ఉంటాయి. స్వామి వారికి కుడివైపున శ్రీ లక్ష్మినారాయణ మూర్తి, ఎడమవైపున శ్రీ సత్యనారాయణస్వామి కొలువై ఉన్నారు.[1]

ఉత్సవాలు

[మార్చు]

మాఘశుద్ధ ఏకాదశి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలూ, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆరురోజుల పాటు ఉత్పవాలు అతివైభవంగా జరుగుతాయి. రధోత్సవము ప్రత్యేక ఆకర్షణగా భావిస్తారు.

చేరుకోవడం ఎలా

[మార్చు]

ఈ ఆలయం, కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలోను, రాజమహేంద్రవరం నుండి 58 కి.మీ. అమలాపురం నుండి 65 కి.మీ. (వయా కోటిపల్లి) దూరంలోను ఉంది. గొల్లల మామిడాడ, పెదపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లాలో తుల్యభాగ నది ఒడ్డున నెలకున్న పుణ్యక్షేత్రం. తూర్పు గోదావరి జిల్లా లోని ప్రసిద్ధ, పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి.

మూలాలు

[మార్చు]
  1. నాగిరెడ్డి, ఎన్. ఎస్. తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాలు. 2003.