శ్రీ స్వామినారాయణ దేవాలయం (వీహాకెన్‌)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ స్వామినారాయణ దేవాలయం (వీహాకెన్‌)
అమెరికాలో మొదటి స్వామినారాయణ దేవాలయం
అమెరికాలో మొదటి స్వామినారాయణ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:న్యూజెర్సీ
ప్రదేశం:వీహాకెన్‌
ఇతిహాసం
వెబ్ సైట్:http://weehawken.issousa.org/

శ్రీ స్వామినారాయణ దేవాలయం, అమెరికా, న్యూజెర్సీ, వీహాకెన్‌లోని స్వామినారాయణ హిందూ దేవాలయం. అమెరికాలోని నరనారాయణ గడిలోని మొదటి స్వామినారాయణ దేవాలయమిది.[1][2] ప్రస్తుతం న్యూజెర్సీలోనే నాలుగు స్వామినారాయణ దేవాలయాలు ఉన్నాయి.[3]

చరిత్ర

[మార్చు]

1981లో న్యూజెర్సీలోని ఒక భక్తుని ఇంటి నేలమాళిగలో అమెరికా మొట్టమొదటి దేవ మందిరం ఏర్పాటుచేయబడి, 1986 వరకు అక్కడే కొనసాగింది.[4]

దేవాలయ చరిత్ర

[మార్చు]
దేవాలయ మధ్య బలిపీఠం

1986లో న్యూజెర్సీలోని వీహాకెన్‌లో హడ్సన్ నది ఒడ్డున ఉన్న చారిత్రక ప్రదేశమైన క్రిస్టియన్ సైంటిస్ట్ మొదటి చర్చిని కొనుగోలు చేశారు.[1] 1987, మే 24న ఆచార్య శ్రీ తేజేంద్రప్రసాద్‌జీ మహారాజ్ వీహాకెన్‌లోని మొదటి స్వామినారాయణ దేవాలయంలో మూర్తి ప్రతిష్ఠా కార్యక్రమాన్ని (దేవతల ఆవాహన) నిర్వహించాడు. అమెరికా, ఆఫ్రికా, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.[4]

వీహాకెన్ మేయర్ రిచర్డ్ ఎఫ్. టర్నర్ గౌరవ అతిథిగా, అసెంబ్లీ సభ్యుడు మిస్టర్ ఆక్టోవియో అల్ఫోన్సో సమక్షంలో హడ్సన్ నది ఒడ్డు సమీపంలో బౌలేవార్డ్ ఈస్ట్‌లోని వెస్ట్ న్యూయార్క్‌లోని కలోనియల్ పార్క్ వద్ద విగ్రహామూర్తులతో ఊరేగింపు ప్రారంభమై, దేవాలయం వరకు సాగింది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Local Hindu temple offers peace". Archived from the original on 2011-07-12. Retrieved 2022-03-26.
  2. "International Swaminarayan Satsang Organization in Weehawken, New Jersey (nj)". Archived from the original on 2011-07-17.
  3. "Swaminarayan temples - USA". Archived from the original on 2020-07-12. Retrieved 2022-03-26.
  4. 4.0 4.1 4.2 "Shree Swaminarayan Temple, New Jersey (I.S.S.O)". Archived from the original on 2016-03-04. Retrieved 2022-03-26.

బయటి లింకులు

[మార్చు]