షామార్ జోసెఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షామార్ జోసెఫ్ వెస్టిండీస్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2024లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వెస్టిండీస్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి తాను అరంగ్రేటం చేసిన తొలి మ్యాచులో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసి పలు రికార్డులను సృష్టించి[1], ఆడిన రెండో టెస్ట్ మ్యాచులోనే ఏడూ వికెటలను తీసి 27 ఏండ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై వెస్టిండీస్ క్రికెట్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.[2][3]

జననం[మార్చు]

షామార్ జోసెఫ్ 31 ఆగస్టు 1999న గయానాలోని బరాకరాలో జన్మించాడు.

క్రీడా జీవితం[మార్చు]

షామార్ జోసెఫ్ వెస్టిండీస్ స్టార్ బౌలర్లు ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్‌లను ఆదర్శనంగా తీసుకొని క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన 2021లో బెర్బిస్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ తన భార్య ప్రోత్సాహంతో పూర్తి స్థాయి క్రికెటర్ గా అడుగుపెట్టి కొన్ని ఫస్ట్-డివిజన్, సెకండ్-డివిజన్ మ్యాచ్‌లలో టక్బర్ పార్క్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తరువాత గయానీస్, రొమారియో షెఫెర్డ్ ద్వారా క్రికెట్‌లో కొన్ని మ్యాచులు ఆడి 2022-23 వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్ సమయంలో 1 ఫిబ్రవరి 2023న బార్బడోస్‌పై గయానా తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి, 2023-24 సూపర్50 కప్ సమయంలో బార్బడోస్‌పై గయానా తరపున లిస్ట్-ఎ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. షామార్ జోసెఫ్క 2023లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో గయానా అమెజాన్ వారియర్స్ జట్టులోని కీమో పాల్‌కు  గాయం కావడంతో ఆయన స్థానంలో ఎంపికై ఆ సీజన్‌లో రెండు మ్యాచులు ఆడాడు.[4]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

షామార్ జోసెఫ్ డిసెంబర్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు-మ్యాచ్‌ల సిరీస్‌కి ఎంపికై అరంగ్రేటం చేసిన తొలి మ్యాచులో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసి పలు రికార్డులను సృష్టించి, రెండో టెస్ట్ మ్యాచులోనే ఏడూ వికెటలను తీసి 27 ఏండ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై వెస్టిండీస్ క్రికెట్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Hindustantimes Telugu (17 January 2024). "85 ఏళ్లలో ఇదే తొలిసారి.. టెస్ట్ క్రికెట్‌లో తొలి బంతికే వికెట్". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  2. Namaste Telangana (29 January 2024). "విండీస్‌ సంచలనం". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  3. The Hindu (28 January 2024). "AUS vs WI second Test | Shamar Joseph bowls West Indies to stunning win over Australia in day/night Test" (in Indian English). Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  4. Eenadu (19 January 2024). "బాడీగార్డ్‌ నుంచి బౌలర్‌ దాకా." Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  5. India Today (17 January 2024). "Who is Shamar Joseph: Fast bowler from remote village in Guyana impresses on Test debut vs Australia in Adelaide" (in ఇంగ్లీష్). Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.