షీనా భాష
Appearance
షీనా | |
---|---|
ݜݨیاٗ Ṣiṇyaá | |
ఉచ్ఛారణ | సింజా |
స్థానిక భాష | పాకిస్తాన్, భారతదేశం |
ప్రాంతం | గిల్గిత్-బాల్టిస్తాన్, కోహిస్తాన్ డిస్ట్రిక్ట్, ద్రాస్, లడఖ్, గురేజ్ |
స్వజాతీయత | షీనా ప్రజలు |
స్థానికంగా మాట్లాడేవారు | 7,20,200 షీనా (2018)[1] షీనా, కోహిస్తాని 458,000 (2018)[2] |
ఇండో-యూరోపియన్
| |
అరబిక్ లిపి [3] | |
భాషా సంకేతాలు | |
ISO 639-3 | Either:scl – ప్రామాణిక షీనాplk – కోహిస్తానీ షీనా |
Glottolog | 1264 షిన్ 1264 షీనాకోహి1248 కోహిస్తానీ షీనా |
ముదురు నారింజ రంగులో షీనా భాష పంపిణీ |
షీనా భాష అనేది షీనా ప్రజలు మాట్లాడే ఇండో - ఆర్యన్ భాష. పాకిస్తాన్‌లో, ప్రధానంగా పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న గిల్గిత్-బాల్టిస్తాన్, భారతదేశంలోని లడఖ్, కాశ్మీర్ లలో నివసిస్తున్న 1,146,000 మంది ప్రజలు మాట్లాడే ప్రధాన భాష.[4][5] ఇది ఇండో- ఆర్యన్ భాషా కుటుంబంలోని ఇండో-ఇరానియన్ భాషా ఉపకుటుంబానికి చెందిన ఇండో-ఆర్యన్ శాఖకు చెందినది. ఈ భాష టార్డిక్ భాషలలో ఒకటిగా వర్గీకరించబడింది .
ఈ భాష మాట్లాడే ప్రాంతాలలో పాకిస్తాన్-నియంత్రిత ప్రావిన్సులలో అస్టోర్, చిలాస్, డారెల్, టాంగీర్, గిల్గిట్, ఘిజర్, బాల్టిస్తాన్, కోహిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. దీనిని భారతదేశ నియంత్రణలో ఉన్న గురేజ్, ద్రాస్, కార్గిల్‌లో మాట్లాడతారు. 1981లో ఈ భాషని మొత్తం దాదాపు 3,21,000 మంది మాట్లాడినట్లు అంచనా.
సాధారణ పదాలు
[మార్చు]షీనా భాషలో వారంపేర్లు సంస్కృతానికి దగ్గరగా ఉంటాయి.
షీనా (దేవనాగరి) | సంస్కృతం |
---|---|
ఆదిత్ | ఆదిత్య వార్ |
సుందురో | సోమ్ వార్ |
ఉంగారో | మంగళ్ వార్ |
బోదో | బుధ్ వార్ |
బ్రెస్పుత్ | బృహస్పతి వార్ |
శుకర్ | శుక్ర్ వార్ |
షింషేర్ | శనిచర్ వార్ |
ఇతర పదాలు
[మార్చు]షీనా | తెలుగు అర్థం |
---|---|
గిలిత్ | గిల్గిత్ |
కోన్? | ఎక్కడ? |
ఆన్ | ఇక్కడ |
అదాన్ | అక్కడ |
ఆల్ | అక్కడ |
ఖిరీ బేయ్ | కూర్చో |
వెయ్ పి | నీరు త్రాగాలి |
తికీ కా | భోజనం చేయండి |
బాబా | తండ్రి |
ఆజి | అమ్మ |
జ్రహ్ | సోదరుడు |
మిష్తి దిశా కోన్ హిన్? | మంచి ప్రదేశం ఎక్కడ ఉంది? |
తు కోన్తే బుజానే? | మీరు ఎక్కడికి వెళుతున్నారు? |
షాల్బాల్ | పిల్లలు |
బడో | పెద్ద |
చునో | చిన్న |
జ్రిగో | పొడవు |
అశతో | బలహీన |
డాంగో | అధికంగా |
మూలాలు
[మార్చు]- ↑ "Shina". Ethnologue. Archived from the original on 2019-06-06. Retrieved 25 June 2019.
- ↑ "Shina, Kohistani". Ethnologue. Archived from the original on 2019-06-05. Retrieved 25 June 2019.
- ↑ "Ethnologue report for Shina". Ethnologue.
- ↑ Saxena, Anju; Borin, Lars (2008-08-22). Lesser-Known Languages of South Asia: Status and Policies, Case Studies and Applications of Information Technology. Walter de Gruyter. ISBN 978-3-11-019778-5.
- ↑ "Shina | Ethnologue". www.ethnologue.com. 2019-06-06. Archived from the original on 2019-06-06. Retrieved 2023-06-17.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)