షెరిల్ పింటో
స్వరూపం
షెరిల్ పింటో | |
---|---|
జననం | 1986 ఫిబ్రవరి 2 |
ఇతర పేర్లు | షెరిల్ బ్రిండో |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008–2010 |
షెరిల్ పింటో ఒక భారతీయ మాజీ నటి, ఆమె ప్రధానంగా తమిళ చిత్రాలలో నటించింది. ఎంగల్ ఆసన్ (2009), వాడా (2010)లతో సహా ఇతర చిత్రాలలో నటించిన ఆమె విజయకాంత్ కలిసి అరసంగం (2008)తో తన అరంగేట్రం చేసింది.[1]
కెరీర్
[మార్చు]షెరిల్ పింటో రమణ మాధేష్ దర్శకత్వం వహించిన తమిళ భాషా చిత్రం అరసంగం (2008)లో విజయకాంత్, నవనీత్ కౌర్‌లతో కలిసి నటించింది. ఎంగల్ ఆసన్ (2009)లో విజయకాంత్‌తో కలిసి తిరిగి నటించింది.[2] ఆమె తెలుగు భాషా చిత్రం సత్యమేవ జయతే (2009)లో కూడా నటించింది.[3] 2011లో, ఆమె కల్లూరి దేశం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడానికి సంతకం చేసింది, కానీ అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. 2012లో, ఆమె రమేష్ అరవింద్ సరసన శక్తి చిదంబరం రూపొందించిన మచాన్‌లో నటించింది. అయితే, ఈ చిత్రం కూడా విడుదల కాలేదు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Sheryl Brindo - Filmography, Movies, Photos, Biography, Wallpapers, Videos, Fan Club, Popcorn.oneindia.in". Archived from the original on 23 జూలై 2012. Retrieved 20 ఏప్రిల్ 2012.
- ↑ "Sheryl Brindo with Vijayakanth again". IndiaGlitz.com. 16 May 2008. Retrieved 26 July 2020.
- ↑ "Satyameva Jayate progressing in RFC". filmibeat.com. 28 November 2008. Retrieved 26 July 2020.
- ↑ Nikhil, Raghavan (25 May 2013). "Etcetera: A comeback of sorts". The Hindu. Retrieved 26 July 2020.
- ↑ "Ramesh Aravind minus Kamal Haasan". The New Indian Express. 28 April 2012. Retrieved 26 July 2020.