బందగి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
షేక్ బందగి భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సల్పిన గొప్ప పోరాట యోధుడు.వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కామాడ్డి గూడెంకు చెందిన ఈయన, 60 ఊళ్లకు భూస్వామి అయిన విస్నూర్ దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డిపై సాహసోపేతంగా పోరాడి అనూహ్య విజయం సాధించాడు. కామారెడ్డి గూడెంలో బందగీకి కొంత వ్యవసాయ భూమి ఉండేది. తన పాలివాడు అయిన ఫకీర్ ఆహ్మద్ బందగీ భూమిపై కన్నేసి దానిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు. ఇతడు విస్నూర్ దేశ్‌ముఖ్ అనుచరుడు. బందగీ ఎదురు తిరగడంతో ఫకీర్ ఆహ్మద్ దేశ్‌ముఖ్‌కు ఫిర్యాదు చేశాడు.
చరిత్ర
[మార్చు]షేక్‌బందాగీ సాహెబ్ పెదానాన్న కుమారుడు అబ్బాస్‌అలీ. ఆయన కుమారుడు ఫకీర్‌అహమ్మద్. ఫకీర్‌అహమ్మద్ విసూనూర్‌దేశ్‌ముఖ్‌రాపాక రామచంద్రారెడ్డి వద్గా ఉద్యోగి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అబ్బాస్‌అలీ విసూనూర్ దేశ్‌ముఖ్‌కు నమ్మినబంటుగా మారాడు. 1941లో బందాగీకి అతని పెదానాన్న కుమారుడు అబ్బాస్‌అలీకి భూసంబంధామైన వివాదాం తలెత్తింది. జ్యేష్టభాగంగా తనకు లభించిన ఎనిమిది ఎకరాల పొలాన్ని అమ్ముకున్న అబ్బాస్‌అలీకి తన దాయాదాులు అనుభవిస్తున్న మిగతా భూమిని కూడా కాజేయాలన్న దుర్బుద్థి పుట్టింది. ఆ దుర్బుద్ధికి దేశ్‌ముఖ్‌రామచంద్రారెడ్డి అండదాండలు అందాయి. ఆ రోజుల్లో ' నైజాం క్రిందా ఉన్న దేశ్‌ముఖ్‌లలో నరరూప రాక్షసుడుగా, కలియుగ రావణాసురుడుగా పేరొందిన విసూనూర్ దేశ్‌ముఖ్‌రాపాక రామచంద్రారెడ్డి, 40 వేల ఎకరాల భూమికి, 60 గ్రామాలకు సర్వాధికారి. ఈ 60 గ్రామాలపై తను చెలాయించని అధికారము అంటూ లేదు. నిర్వహించని దౌర్జన్యం అంటూ లేదాు. నిర్బంధా వెట్టిచాకిరి చెప్పతరం కాదు. గ్రామాలలో గల ప్రతి కులము వారు కులాల వారిగా వెట్టిచాకిరి చెయ్యాలి. ప్రతి పండుగకు, పబ్బానికి మామూళ్ళు ఇచ్చుకోవాలి. వ్యవసాయ పనులకుగాను అన్ని రకాల వెట్టిచాకిరి సేవలు చెయ్యాలి. చివరకు బ్రహ్మణులను కూడా వదాలలేదాు. వీరు విస్తర్లు కుట్టి దొరల ఇండ్లకు సరఫరా చెయ్యాలి. భూస్వాముల, దొరల ఇండ్లలో పనులు చేయుటకు బానిసలుగా బాలికలను పంపే ఆచారము ఈ ఫ్యూడల్ దోపిడికెల్లా అతి దారుణమైంది.
గ్రామాలలో
[మార్చు]గ్రామాలలో ఎవరైనా ఎక్కడైనా మేకనో, గొర్రెనో కోస్తే దానిలో కొంత ఆ ఊరి దొరకు పంపాలి. 1940లో విస్నూర్ గ్రామములో దేశ్‌ముఖ్‌బంగ్లా నిర్మాణానికి వెట్టి కొరకు మనుషులనే కాక బండి నడిపే కోడెలను (పశువులను) నిర్బంధగా తోలుకెల్లినారు. చందాలు వసూళ్ళు చేయించాడు. ఆనాటి కాలములో పంటచేను, పాడిఆవు, పడుచు బిడ్డ, నడిచేగొడ్డు, నాలుగు కాసులు ఇవన్ని దేశ్‌ముఖ్‌దౌర్జన్యానికి బలి అయ్యేవి. గ్రామాలలో గొడవలు ఏర్పడితే వాటిని దేశ్‌ముఖ్‌గడిలో పరిష్కరించడం ఆనవాయితీ. దేశ్‌ముఖ్‌ఆధీనములో గల గ్రామాలలో సివిల్, క్రిమినల్‌కేసులతో సహా స్వంత పోలీసు బలగాలతో సర్వాధికారాలు చెలాయించాడు. అనాడు అతనిని ఎదిరించడం అంటే మృత్యువును ఆహ్వనించినట్టే. తన 60 గ్రామాలలోని ధానిక, భూస్వామ్య మక్తిదారులపై విసూనూర్ దేశ్‌ముఖ్‌పెత్తనం చెలాయించాడు. తన ఆధిపత్యాన్ని అంగీకరించని వారి ఆస్తి-పాస్తులిన్ని సర్వనాసనం చేయించేది. ఆతడు సాగించిన దౌర్జన్యాలు ఒక ఎత్తు అయితే, అతని ఏజెంట్లు, గూండాలు సాగించుకున్న పాశవిక నికృష్టాలు, చేసిన హత్యలు మరొక ఎత్తు' (బందాగీ కోర్టుబాట- తెలంగాణా పోరుబాట (1928-40), పేజి.216) అటువంటి భయానక దేశ్‌ముఖ్‌ప్రాపకం సంపాదించిన అబ్బాస్‌అలీకి తమ్ముళ్ళ భూమిని కాజేయడం ఏమాత్రం కష్టం అన్పించలేదు.
బందాగీ కోర్టులో
[మార్చు]ఈ కేసు వేసి గెలుపొందడం ఆరోజుల్లో మాములు విషయంకాదు.దేశ్‌ముఖ్ ఫకీర్ ఆహ్మద్‌కు భూమి ఇవ్వాలని బందగీని బెదిరిస్తూ వచ్చాడు. బందగీ ససేమిరా ఇవ్వనంటూ జనగామ కోర్టులో సివిల్ కేసు వేశాడు. అయితే 1941 జూలై 17లో జనగామ తాలూకా మేజివూస్టేట్ తీర్పు వెల్లడించాల్సి ఉంది. తీర్పును ముందే పసిగట్టిన దేశ్‌ముఖ్ బందగీని చంపమని తన కిరాయి మూకలను పురమాయించాడు. ఒక పథాకం ప్రకారంగా బందాగీ జనగాం కోర్టునుండి బయలుదేరి కామరెడ్డిగూడెం బస్టాండు వద్ద బస్సుదిగి ఇంటికివెళ్లు దారిలో పొంచి ఉన్నగూండాలు విసూనూర్ దేశ్‌ముఖ్ గూండాలు ఒంటరివాన్నీబందాగీని పాశవికంగ హత్య చేసారు.
వీర మరణం
[మార్చు]జనగామ-సూర్యాపేట రహదారిలోని బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళుతున్న బందగీని అంతకు ముందే మాటు వేసిన దేశ్‌ముఖ్ గూండాలు గొడ్డళ్లతో దాడి చేసి, కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. నమ్మిన న్యాయం కోసం ఏ సంఘం అండలేకుండా ప్రాణాలకు తెగించి, రజాకార్ నాయకుడైన విస్నూర్ దేశ్‌ముఖ్‌పై విజయం సాధించి వీర మరణం పొందిన బందగీ తెలంగాణ బిడ్డలకు చిరస్మరణీయుడైనాడు.