షొరీఫుల్ ఇస్లాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షొరీఫుల్ ఇస్లాం
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ షొరీఫుల్ ఇస్లాం
పుట్టిన తేదీ (2001-06-03) 2001 జూన్ 3 (వయసు 22)
పంచగఢ్, బంగ్లాదేశ్
ఎత్తు6 ft 3 in (191 cm)[1][2]
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 97)2021 ఏప్రిల్ 29 - శ్రీలంక తో
చివరి టెస్టు2023 జూన్ 14 - Afghanistan తో
తొలి వన్‌డే (క్యాప్ 136)2021 మే 25 - శ్రీలంక తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 6 - బంగ్లాదేశ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.47
తొలి T20I (క్యాప్ 70)2021 మార్చి 28 - న్యూజీలాండ్ తో
చివరి T20I2023 మార్చి 31 - ఐర్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.47
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 7 21 31 16
చేసిన పరుగులు 48 48 24 90
బ్యాటింగు సగటు 6.00 6.00 4.00 6.42
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 26 16 6 26
వేసిన బంతులు 1014 916 595 2160
వికెట్లు 15 33 34 39
బౌలింగు సగటు 34.73 24.84 25.64 28.58
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/28 4/21 3/21 7/54
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 1/– 4/– 2/–
మూలం: ESPNcricinfo, 16 September 2023

మొహమ్మద్ షొరీఫుల్ ఇస్లాం ( జననం 2001 జూన్ 3) బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు. అతను 2021 మార్చిలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.[3]

దేశీయ, అండర్-19 కెరీర్[మార్చు]

షోరీఫుల్ 2017 సెప్టెంబరు 15న 2017–18 నేషనల్ క్రికెట్ లీగ్‌లో రాజ్‌షాహీ డివిజన్‌కు ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు.[4] తన తొలి లిస్టు A మ్యాచ్‌, 2018 ఫిబ్రవరి 7న 2017–18 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడాడు.[5]

షోరీఫుల్ 2017–18 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసుకుని ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్‌కు సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలరుగ నిలిచాడు. [6]

షోరీఫుల్ బంగ్లాదేశ్ A తరపున 2018 ఆగస్టు 13న ఐర్లాండ్ A తో జరిగిన ట్వంటీ20లో ప్రవేశించాడు. [7] ఆ మరుసటి రోజున, 2018 ఆసియా కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు 31 మందితో కూడిన ప్రిలిమినరీ స్క్వాడ్‌ ప్రకటించినపుడు అందులో చోటు సంపాదించాడు.[8]

2018 అక్టోబరులో, 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో షోరిఫుల్, ఖుల్నా టైటాన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [9] 2018 డిసెంబరులో, 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. [10] 2019 డిసెంబరులో అతన్ని, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులోకి తీసుకున్నారు.[11]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

2021 జనవరిలో, వెస్టిండీస్‌తో జరిగే వన్ డే ఇంటర్నేషనల్ (వన్‌డే) సిరీస్‌కు ప్రాథమిక జట్టులో ఎంపికైన నలుగురు కొత్త ఆటగాళ్ళలో షోరీఫుల్ ఒకడు. [12] అదే నెలలో, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల కోసం బంగ్లాదేశ్ వన్‌డే జట్టులో అతను ఎంపికయ్యాడు. [13] [14] మరుసటి నెలలో, అతను న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం ఎంపికయ్యాడు. [15] బంగ్లాదేశ్ తరపున 2021 మార్చి 28న న్యూజిలాండ్‌పై తన తొలి T20I ఆడాడు. [16]

2021 ఏప్రిల్లో, శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ ప్రాథమిక టెస్టు జట్టులో షోరీఫుల్‌ను చేర్చారు. [17] [18] మొదటి టెస్టుకు తుది 15 మందితో కూడిన జట్టులో అతను ఉన్నాడు. [19] 2021 ఏప్రిల్ 29న బంగ్లాదేశ్ తరపున శ్రీలంకతో జరిగిన టెస్టులో రంగప్రవేశం చేశాడు. [20] 2021 మేలో, శ్రీలంకతో జరిగే సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్‌డే జట్టులో ఎంపికై, [21] 2021 మే 25న శ్రీలంకపై తన తొలి వన్‌డే ఆడాడు. [22]

మూలాలు[మార్చు]

  1. "Domestic games can unlock potential". The Daily Star. 6 October 2018. ఎడమచేతి seamer Shoriful announced himself at the age of 16 when he made his first-class debut last year for Rajshahi Division. The six-feet-three-inch tall బౌలరు[...]
  2. "Two new frontrunners to pick up pace baton". The Daily Star. 14 January 2021. Young Shoriful showed his talent and aggression during Bangladesh's ICC Under-19 World Cup-winning campaign last year, where the youngster impressed with a consistent line and length. The six feet three inches tall pacer uses his height well[...]
  3. "Shoriful Islam". ESPN Cricinfo. Retrieved 15 September 2017.
  4. "Tier 2, National Cricket League at Rajshahi, Sep 15-18 2017". ESPN Cricinfo. Retrieved 15 September 2017.
  5. "4th match, Dhaka Premier Division Cricket League at Fatullah, Feb 7 2018". ESPN Cricinfo. Retrieved 7 February 2018.
  6. "Dhaka Premier Division Cricket League, 2017/18: Prime Bank Cricket Club". ESPN Cricinfo. Retrieved 5 April 2018.
  7. "1st unofficial T20, Bangladesh A Tour of Ireland at Dublin, Aug 13 2018". ESPN Cricinfo. Retrieved 13 August 2018.
  8. "Liton Das recalled as Bangladesh reveal preliminary squad for Asia Cup 2018". International Cricket Council. Retrieved 14 August 2018.
  9. "Full players list of the teams following Players Draft of BPL T20 2018-19". Bangladesh Cricket Board. Retrieved 29 October 2018.
  10. "Media Release : ACC Emerging Teams Asia Cup 2018: Bangladesh emerging squad announced". Bangladesh Cricket Board. Retrieved 3 December 2018.
  11. "Media Release : ICC U19 CWC South Africa 2020 : Bangladesh Under 19 Team Announced". Bangladesh Cricket Board. Retrieved 21 December 2019.
  12. "No place for Mashrafe against West Indies". The Daily Star. Retrieved 4 January 2021.
  13. "Shakib Al Hasan named in Bangladesh squad for West Indies ODIs". ESPN Cricinfo. Retrieved 16 January 2021.
  14. "Shoriful Islam's Bangladesh call-up causes much delight but little surprise". ESPN Cricinfo. Retrieved 16 January 2021.
  15. "Bangladesh leave out Taijul Islam for New Zealand tour". ESPN Cricinfo. Retrieved 19 February 2021.
  16. "1st T20I, Hamilton, Mar 28 2021, Bangladesh tour of New Zealand". ESPN Cricinfo. Retrieved 28 March 2021.
  17. "Media Release : Bangladesh Preliminary Squad for Tour of Sri Lanka 2021 announced". Bangladesh Cricket Board. Retrieved 9 April 2021.
  18. "Uncapped Mukidul, Shohidul in Bangladesh 21-player Test squad that will travel to Sri Lanka". ESPN Cricinfo. Retrieved 9 April 2021.
  19. "Uncapped Shoriful in Bangladesh squad for first Sri Lanka Test". BD Crictime. Retrieved 20 April 2021.
  20. "2nd Test, Kandy, Apr 29 - May 3 2021, Bangladesh tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 29 April 2021.
  21. "Bangladesh drop Najmul Hossain Shanto for first two ODIs against Sri Lanka, Shakib Al Hasan returns". ESPN Cricinfo. Retrieved 20 May 2021.
  22. "2nd ODI (D/N), Dhaka, May 25 2021, Sri Lanka tour of Bangladesh". ESPN Cricinfo. Retrieved 25 May 2021.