Jump to content

సంగమూడి

వికీపీడియా నుండి

సంగమూడి కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సంగమూడి
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కృత్తివెన్ను
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి కూనసాని వరలక్ష్మి
పిన్ కోడ్ 521 324
ఎస్.టి.డి కోడ్ 08672

రవాణా సౌకర్యాలు

[మార్చు]

బంటుమిల్లి నుండి, కైకలూరు ల నుండి బస్సు, ఆటోల సౌకర్యం ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు పాఠశాల.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కూనసాని వరలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైంది. [1]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ కోదండరామాలయం

[మార్చు]

గ్రామములోని ఈ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో, 18 లక్షల రూపాయల గ్రామస్థుల, భక్తుల విరాళాలతో, నూతన ఆలయాన్ని నిర్మించారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ, శ్రీరాములవారల విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2017, మార్చి-12,13తేదీలలో ప్రతిష్ఠా విగ్రహాలకు, గ్రామోత్సవాలు నిర్వహించారు. ఆలయంలో, 14వతేదీ మంగళవారం, 15వతేదీ బుధవారంనాడు వైభవంగా విగ్రహ, శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళ, బుధవారాలలో ఆలయంలో ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహించారు. విగ్రహప్రతిష్ఠా మహోత్సవాల అనంతరం భారీగా అన్నసమారాధన చేసారు. [2]&[3]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం

[మార్చు]

సంగమూడి గ్రామములో జరుగుచున్న శ్రీ గంగానమ్మ తల్లి జాతర 2015ఆగష్టు-23వ తేదీ ఆదివారంతో ముగిసినది. పొలాలలోమున్న అమ్మవారికి గ్రామస్థులు ఉదయం నుండి మేళతాళాలు, డప్పునృత్యాలతో, వేడి నైవేద్యాలు సమర్పించారు. పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ వీధులలో జాతర నిర్వహించారు. భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. జాతరలో గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.


"https://te.wikipedia.org/w/index.php?title=సంగమూడి&oldid=3558990" నుండి వెలికితీశారు