Jump to content

సంజయ్ కుటే

వికీపీడియా నుండి
డా. సంజయ్ కుటే

కార్మిక శాఖ మంత్రి
పదవీ కాలం
2019 జూన్ 16 – 2019 నవంబర్ 8
ముందు సంభాజీ పాటిల్ నీలంగేకర్
తరువాత దిలీప్ వాల్సే పాటిల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004
ముందు క్రుష్ణరావు ఇంగ్లే
నియోజకవర్గం జల్గావ్ (జామోద్)

వ్యక్తిగత వివరాలు

జననం (1969-03-09) 1969 మార్చి 9 (వయసు 55)
మదఖేడ్ జల్గావ్ జమోద్ , మహారాష్ట్ర , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు శ్రీరామ్ కుటే
జీవిత భాగస్వామి అపర్ణ కుటే
సంతానం అభిషేక కుటే
శంతను కుటే
పూర్వ విద్యార్థి అమరావతి యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

సంజయ్ కుటే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు జల్గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సంజయ్ కుటే 1969 మార్చి 9న బుల్దానా జిల్లాలోని జల్గావ్-జామోద్‌లో జన్మించాడు. ఆయన జలగావ్ జామోద్‌లోని ది న్యూ ఎరా హైస్కూల్ నుండి 1985లో 10వ, 1988లో అమరావతి విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియట్, 1994లో గురుకుంజ్ ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ పూర్తి చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సంజయ్ కుటే భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో జల్గావ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భరిపా బహుజన్ మహాసంఘ్ అభ్యర్థి ప్రసేన్‌జిత్ కిసాన్ తయాడేపై 45177 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భరిపా బహుజన్ మహాసంఘ్ అభ్యర్థి ప్రసేన్‌జిత్ కిసాన్ తయాడేపై 4695 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

సంజయ్ కుటే 2019 ఎన్నికలలో జల్గావ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ స్వాతి సందీప్ వాకేకర్‌పై 35231 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 జూన్ 16 నుండి 2019 నవంబర్ 8 వరకు దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశాడు..[4] ఆయన 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ స్వాతి సందీప్ వాకేకర్‌పై 18771 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]

పార్టీలో నిర్వహించిన పదవులు

[మార్చు]
  • బీజేపీ మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి (2014)
  • జలగావ్ జామోద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు (2003-2006)
  • బీజేపీ బుల్దానా జిల్లా అధ్యక్షుడు (2010 నుండి)
  • బీజేపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షుడు (2020)

మూలాలు

[మార్చు]
  1. BBC News मराठी (21 June 2022). "संजय कुटे कोण आहेत? जे एकनाथ शिंदेंना मिलिंद नार्वेकरांच्या आधी भेटायला पोहोचले होते..." Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
  3. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. "Maharastra Assembly Election Results 2024 - Jalgaon". Election Commision of India. 23 November 2024. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
  6. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)