సండే ఫన్ డే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సండే ఫన్ డే
స్థానంహుసేన్ సాగర్, హైదరాబాద్
నవీకరణ2021
నిర్వహిస్తుందిహైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ
స్థితిప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు

సండే ఫ‌న్‌ డే హైదరాబాద్ నగర ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆదివారం హుస్సేన్ సాగర్, ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న కార్యక్రమం. ట్యాంక్‌బండ్‌ అత్యాధునిక హంగులతో, వారసత్వ శోభను సంతరించుకొన్న సందర్భంగా నగర వాసులను, పర్యటకులను ఆహ్లాదపరిచ్చేందుకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ పరిపాలనా శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.[1]

ప్రస్థానం[మార్చు]

హైదరాబాద్‌ లోని పర్యాటక ప్రాంతం ట్యాంక్‌బండ్ అందాలను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉండేలా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయాలని 2021 ఆగస్టులో ఓ నెటిజెన్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై స్పందించిన ఐటీ మంత్రి కేటీఆర్ ట్రాఫిక్ విషయమై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ని ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ప్రతి ఆదివారం వాహనాల రాకపోకలపై నిషేధం అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రణాళిక రూపొందించాలని ట్వీట్ చేశాడు. మంత్రి ట్వీట్ తో పోలీసులు మొదట ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.[2] ఈ సమయంలో కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతినివ్వనున్నారు.

ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్ డే కార్యక్రమం 2021 ఆగస్టు 29న ప్రారంభమైంది.[3] ట్యాంక్‌బండ్‌పై పర్యాటకులను ఆకర్షించేందుకు అధికారులు ఆర్మీ బ్యాండ్, లేజర్ షో, టెస్కో హాండ్లూమ్ స్టాల్, ఫుడ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయడంతో సందర్శకుల రద్దీ పెరగడంతో 25 సెప్టెంబరు నుండి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలను పొడిగించారు.[4][5] కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా డిసెంబర్ 5న 'సండే ఫన్ డే’ కార్యక్రమం నిర్వహించలేదు.[6]

కార్యక్రమాలు[మార్చు]

ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న సండే ఫన్‌ డే కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒగ్గు డోలు కళాకారుల డప్పువాయిద్యాలు, ఆదివాసీ గిరిజనుల ధింసా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బుద్ద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బాణాసంచా పేలుళ్లు, తారాజువ్వల సందడి, రంగురంగుల వీధి దీపాల వెలుగులు చిన్నారులను ఆకట్టు కుంటున్నాయి. సండే ఫన్‌ డే కు సందర్శకుల నుండి ఆదరణ పెరగడంతో కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు అధికారులు పిల్లలకు సంబంధించిన వినోద కార్యక్రమాలు, హస్తకళల స్టాల్స్, సంగీత కార్యక్రమాలు, లేజర్ షో, ట్యాంక్ బండ్ అన్ని వైపులా సందర్శకులు కూర్చొనే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సందర్భంగా 2021 సెప్టెంబ‌ర్ 18న సండే ఫ‌న్‌ డే కార్యక్రమం నిర్వహించలేదు, [7] గ‌ణేశ్ నిమ‌జ్జ‌న అనంతరం సెప్టెంబ‌ర్ 25న తిరిగి ప్రారంభించి టీఎస్ పోలీస్ బ్యాండ్, ఆర్కేస్ట్రా – తెలుగు పాట‌లు, ఒగ్గు డోలు, గుస్సాడీ, బోనాలు, కోలాటం, హ్యాండ్లూమ్ స్టాల్స్‌ లను ఏర్పాటు చేశారు.[8][9]

స్టాళ్ల ఏర్పాటు[మార్చు]

ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే ఫన్ డేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు చాలామంది ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో సండే ఫన్ డే సందర్భంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని హెచ్‌ఎండీఏ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్నవారిని లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి నామమాత్రపు ఫీజుతో రెండు వారాల పాటు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

స్టాళ్లలో ఉంచే ఉత్పత్తులు, ధరలతోపాటు సంప్రదించాల్సిన వారి వివరాలు తదితరమైనవి ea2ps-maud @telangana.gov.in లేదా hcip hmda@gmail.com, mailto:hmda@gmail.com చిరునామాలకు మెయిల్ చేయాలని లేదా హెచ్‌ఎండిఎ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రతి సోమ, మంగళ వారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లిఖిత పూర్వక విజ్ఞప్తిని అందజేయవచ్చని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.[10]

సందర్శకులకు ఏర్పాట్లు[మార్చు]

సండే ఫన్ డేకు ట్యాంక్‌బండ్‌ వచ్చే సందర్శకుల కోసం మొబైల్‌ టాయిలెట్స్‌, చెత్తాచెదారం పేరుకోకుండా ప్రత్యేకం డస్ట్‌బిన్‌లను, తాగునీటి వసతి, తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యాక్రమాలు ఏర్పాటు చేశారు. టాంక్‌బండ్‌ పైకి వచ్చే వేలాది మంది సందర్శకులను దృష్టిలో ఉంచుకుని కరోనా జాగ్రత్తలో భాగంగా ప్రతి ఒక్కరికీ హెచ్‌ఎండిఏ తరపున ఉచితంగా మాస్క్‌లను, మొక్కలను పంపిణీ చేస్తున్నారు.

ట్రాఫిక్‌ మల్లింపు, పార్కింగ్ ఏర్పాటు[మార్చు]

అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను లేపాక్షి వరకు, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వారు చిల్డ్రన్ పార్కు వరకు పార్కింగ్ కు పోలీసులు స్థలాలను కేటాయించారు.[11][12]

వాహనాదారులు పార్కింగ్ ఎక్కడ చేసుకోవచ్చంటే..
  • అంబేద్కర్‌ విగ్రహాం, లేపాక్షి
  • డాక్టర్‌ కార్స్‌, నెక్లెస్ రోడ్డు
  • న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, ఆదర్శనగర్‌.
  • న్యూ సెక్రటేరియట్‌
  • బుద్ధ భవన్‌ వెనకాల
  • ఎన్టీఆర్‌ గార్డెన్‌, నెక్లెస్ రోడ్డు
ట్రాఫిక్‌ మల్లింపులు..
  • లిబర్టీ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలు అంబేద్కర్‌ విగ్రహం నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ కింద నుంచి ఇక్బాల్‌ మినార్‌ మీదుగా వెళ్లాలి.
  • తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ కింద నుంచి ట్యాంక్‌ బండ్‌కు వచ్చే వారు అంబేద్కర్‌ విగ్రహం మీదుగా లిబర్టీ హిమాయత్‌నగర్‌ వైపు వెళ్లాలి.
  • కర్బాలా మైదాన్‌ నుంచి ట్యాంక్‌ బండ్‌ వైపు వచ్చే వాహనదారులు సెయిలింగ్‌ క్లబ్‌ నుంచి కవాడిగూడ, డీబీఆర్‌ మిల్స్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ దేవాలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ మీదుగా మళ్లిస్తారు.
  • అలాగే డీబీఆర్‌ మిల్స్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి వచ్చే వారిని. డీబీఆర్‌ మిల్స్, గోశాల, కవాడిగూడ, జబ్బార్‌ కాంప్లెక్స్‌, బైబిల్‌ హౌస్‌ మీదుగా మళ్లిస్తారు.
  • ఇక ఇక్బాల్‌ మినార్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చే వారిని పాత సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా మళ్లిస్తారు.[13]

మూలాలు[మార్చు]

  1. Telugu A. B. P. (12 September 2021). "ఈ ఆదివారం నుంచి ట్యాంక్ బండ్‌పై మరిన్ని సర్‌ప్రైజ్‌లు.. ఫుల్ ఖుషీలో నగర వాసులు" (in ఇంగ్లీష్). Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  2. 10TV (11 September 2021). "ట్యాంక్ బండ్‌‌పై మరింత ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ కోర్ట్..మ్యూజిక్ | Not to be missed "Sunday Funday" on Sept 12 from 5-10 pm" (in telugu). Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Andrajyothy (12 September 2021). "ట్యాంక్‌బండ్‌పై ప్రారంభమైన సండే-ఫన్ డే కార్యక్రమం". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  4. Namasthe Telangana (25 September 2021). "మధ్యాహ్నం ౩ నుంచే సండే - ఫన్‌డే". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  5. 10TV (25 September 2021). "సన్ డే - ఫన్ డే, సమయంలో మార్పులు..ట్రాఫిక్ ఆంక్షలు" (in telugu). Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. 10TV (2 December 2021). "సండే ఫన్ డే ఈ ఆదివారం ఉండదు | Sunday-Funday event shall not be held this Sunday" (in telugu). Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Namasthe Telangana (16 September 2021). "ఈ ఆదివారం ట్యాంక్ బండ్‌పై 'సండే - ఫ‌న్‌డే' లేదు". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  8. Namasthe Telangana (23 September 2021). "'సండే-ఫన్‌ డే' ఈజ్ బ్యాక్.. ఈ వారం ప్రోగ్రామ్స్ ఇవే." Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  9. Andrajyothy (25 September 2021). "ఆదివారం టాంక్‌ బండ్‌పై ' సన్‌ డే ఫన్‌ డే' కు మరిన్ని ఆకర్షణలు". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  10. Sakshi (14 October 2021). "సండే-ఫండే'లో స్టాల్‌ పెడతారా?". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  11. Telangana Today (2 October 2021). "Here are the traffic restrictions for Sunday-Funday at Tank Bund". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  12. Eenadu (29 September 2021). "ట్యాంక్‌ బండ్‌పై 'సన్‌డే-ఫన్‌డే' సందడి". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  13. TV9 Telugu (3 October 2021). "ఈ సండే హైదరాబాదీలకు జాలీడే.. ట్యాంక్‌బండ్‌పై నేటి ప్రత్యేకతలు ఇవే.. వాహనదారులు అలర్ట్‌". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)