సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం (కోహెడ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం
సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం
మతం
అనుబంధంహిందూ
జిల్లారంగారెడ్డి జిల్లా
దైవంవేణుగోపాలస్వామి
ప్రదేశం
ప్రదేశంకోహెడ, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం
రాష్ట్రంతెలంగాణ
దేశంభారతదేశం
వాస్తుశాస్త్రం.
శైలిదేవాలయ

సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కోహెడ గ్రామంలో ఉన్న దేవాలయం. ఎనిమిదిన్నర శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో రుక్మిణీ, సత్యభామ సమేతంగా సంతాన వేణుగోపాలస్వామి కొలువై ఉన్నాడు. ధనుర్మాసంలో అవివాహిత యువతులు నిత్యం సూర్యోదయానికి ముందే దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించి హారతులతో గోదాదేవికి ప్రదక్షిణలు చేస్తే తప్పక వివాహం అవుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం.[1]

చరిత్ర

[మార్చు]

పూర్వం కోహెడ సమీపంలోని గుట్ట ప్రాంతంలో కోయరాజులు నివసించేవారు. గుట్టకు తూర్పున ఉన్న పట్టణంలో నాగరికులు ఉండేవారు. గుట్టకు తూర్పున ఉన్న రంగనాయకస్వామికి కోయరాజులు పూజలు నిర్వహించేవారు. కోయరాజులపై నాగరికులు దాడిచేయగా జరిగిన యుద్ధంలో అమాయకులైన కోయలు మరణించారు. కొన్నాళ్ళ తరువాత పట్నవాసులకు అనారోగ్యం వచ్చి, రక్త విరేచనాలతో ఒక్కొక్కరూ చనిపోసాగారు. కోయరాజుల శాపం వల్లే తమకీ దుర్గతి పట్టిందని గ్రహించిన నాగరికులు కోయరాజులను శరణుకోరారు. తమ పేరుతో కోహెడ గ్రామం నిర్మించాలని ఆదేశించగా, కోహెడ గ్రామం నిర్మితమైంది. ఆ తరువాత కోయరాజులు వేణుగోపాలస్వామి దేవాలయాన్ని కట్టించారని స్థలపురాణం చెబుతోంది.[1]

దేవాలయ పునరుద్ధరణ

[మార్చు]

పారిశ్రామికవేత్త భార్య చొరవతో 2001లో ఈ దేవాలయ పునరుద్ధరణ జరిగింది. గ్రామస్తుల సహకారంతో గాలిగోపురం, కల్యాణ మంటపం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి.

బ్రహోత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారిని గ్రామంలో వైభవంగా ఊరేగిస్తారు. సంతానం లేని దంపతులు బ్రహ్మోత్సవాల్లో గరుడ ముద్ద స్వీకరించి, మరుసటి రోజు కల్యాణోత్సవంలో పాల్గొంటే పిల్లలు కలుగుతారని విశ్వాసం. దేవాలయంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు కూడా వైభవంగా జరుగుతాయి.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 telugu, NT News (2021-08-29). "కృష్ణాష్ట‌మి 2021 | ఆ గుళ్లో పూజ‌లు చేస్తే పిల్లలు పుడ‌తారట‌.. భక్తుల విశ్వాసం". www.ntnews.com. Archived from the original on 2021-09-02. Retrieved 2023-01-20.