సంబద్ధత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరమాణువులలో ఉత్తేజ స్థాయి నుండి భూస్థాయికి సంక్రమణ చెందే క్రమంలో ఎలక్ట్రాన్లు దృగ్గోచర కాంతిని ఉద్గారిస్తాయని మనకు తెలుసు. సాధారణ కాంతి జనకంలో క్రమరహితంగాను ఉంటాయి. ఏదైనా తెరపై ఒక బిందువును చేరేన్ కాంతి కచ్చితమైన ప్రావస్థ సంబంధం లేకుండా ఉంటాయి. కాని లేసర్ జనకంలో, ఈ దృగ్విషయం అత్యంత క్రమబద్ధంగా నిర్దిష్ట ప్రావస్థతో కాల గమనంతో పాటు మారకుండా, కాంతి ఉద్గారమవుతుంది. దీనినే "కాల సంబద్ధత" అంటారు.సాధారణ కాంతిలో అసంబంద్ధత వలన"దృక్ రొద" యేర్పడుతుంది. లేసర్ "దృక్ సంగీతం" అవుతుంది. సంబద్దత అనునది లేసర్ లక్షణాలలో ముఖ్యమైనది.

లేసర్[మార్చు]

లేసర్ (LASER) అనునది ఒక సంక్షిప్తపదం. ("Light Amplification by Stimulated Emission of Radiation") అనగా "ఉత్తేజిత కాంతి ఉద్గారం వలన కాంతి వర్థకము" చెందే ప్రక్రియను సూచిస్తుంది. లేసర్ ప్రత్యేక లక్షణాలున్న ఒక కాంతి జనకం. ఈ ప్రత్యేక లక్షణాలు సాధారణంగా మనం చూసే సూర్యుడు, ఉష్ణోద్గార దీపం, ఏకవర్ణ కాంతి జనకం, సోడియం దీపం వంటి కాంతి జనకలలో ఉండవు.

దీనిని 1954 వ సంవత్సరంలో డా.చార్లెస్.టౌన్స్ మొదటి సారిగా లేసర్ యొక్క శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రతిపాదించారు. 1960 వ సంవత్సరంలో అనేక శాస్త్రజ్ఞుల ప్రయాసలతో "స్పందన లేసర్" రూపొందింది.

లేసర్ కాంతి లక్షణాలు[మార్చు]

సాధారణ కాంతి జనకానికి, లేసర్ కు మధ్య నాలుగు ప్రధాన తేడాలున్నాయి. 1.సంబద్ధత 2.దిశనీయత 3. ఏకవర్ణీయత 4. తీవ్రత.

"https://te.wikipedia.org/w/index.php?title=సంబద్ధత&oldid=3162129" నుండి వెలికితీశారు