సకలతత్వార్థదర్పణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సకలతత్వార్థదర్పణము
పుస్తక ముఖచిత్రం
కృతికర్త: సందడి నాగదాసు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నిఘంటువు
ప్రచురణ: బరూరు త్యాగరాయ శాస్త్రులు అండ్ సన్
విడుదల: 1925
పేజీలు: 214


సకలతత్వార్థదర్పణము 1925 సంవత్సరంలో పునర్ముద్రించబడిన వేదాంతశాస్త్ర నిఘంటువు. ఇందులో వేదాంతశాస్త్రంకు సంబంధించిన చాలా పదాలను చక్కగా నిర్వచించారు. దీనిని సందడి నాగదాసు రచించగా చెన్నపురిలోని బరూరు త్యాగరాయ శాస్త్రులు అండ్ సన్ వారి స్వకీయ గీర్వాణభాషారత్నాకర ముద్రాక్షరశాల యందు ముద్రించబడింది. సుమారు 214 పేజీలున్న ఈ గ్రంథము అప్పటి వెల ఒక రూపాయి మాత్రమే.

ఈ నిఘంటువు సకల ప్రజలకు అర్ధమయ్యే విధంగా వేదాంతశాస్త్రానికి సంబంధించిన తెలుగు పదాలు వాటి గురించి వివరణతో కూడిన అర్ధాన్ని అందించారు. అందువలన క్లిష్టమైన వేదాంతాల సారాన్ని అందుకోగలుగు తారని రచయితల ఆకాంక్ష.

విషయసూచిక

[మార్చు]
ప్రథమ నిరుక్తము
  1. త్రిసంఖ్యా ప్రకరణము
  2. చతుస్సంఖ్యా ప్రకరణము
  3. పంచసంఖ్యా ప్రకరణము
ద్వితీయ నిరుక్తము
  1. షట్‌సంఖ్యా ప్రకరణము
  2. సప్తసంఖ్యా ప్రకరణము
  3. అష్టసంఖ్యా ప్రకరణము
  4. నవసంఖ్యా ప్రకరణము
  5. దశసంఖ్యా ప్రకరణము
  6. ఏకాదశసంఖ్యా ప్రకరణము
  7. ద్వాదశసంఖ్యా ప్రకరణము
  8. చతుర్దశసంఖ్యా ప్రకరణము
  9. పంచదశసంఖ్యా ప్రకరణము
  10. షోడశదశసంఖ్యా ప్రకరణము
  11. సప్తదశసంఖ్యా ప్రకరణము
  12. అష్టాదశసంఖ్యా ప్రకరణము
  13. ఏకోనవింశతిసంఖ్యా ప్రకరణము
  14. వింశతిసంఖ్యా ప్రకరణము
  15. ఏకవింశతిసంఖ్యా ప్రకరణము
  16. చతుర్వింశతిసంఖ్యా ప్రకరణము
  17. ద్వాత్రింశతిసంఖ్యా ప్రకరణము
తృతీయ నిరుక్తము
  1. సంఖ్యారహితశబ్ద ప్రకరణము
చతుర్థ నిరుక్తము

ఇష్టదైవ స్తోత్రము

[మార్చు]

రాజయోగ విద్య వి
చారాత్మక జనపయోధీ చంద్రమ భవసం
సారాటవి సుచి లక్ష్మీ
నారాయణ నిన్ను నామనంబున దలతున్.

కవిస్తుతి

[మార్చు]

సందడి రామాహ్వాయ ప్రియ నందనుడను విష్ణుభక్తి నైష్టికుడను సా
నందుడ నాగన నాముడ పొందగ వేదాంతవిధుల బొగడెడివాడన్.

గ్రంథోత్పత్తి దేశకాలనిర్ణయము

[మార్చు]

సీ. శ్రీకరంబగు మర్త్యలోకంబునందున భరతఖండమున సిరులదనరు
బందరు విషయంబునందు నందిగ్రామ సీమలో మిక్కిలి చెలగుచున్న
జగ్గయ్యపేట కీశాన్యమం దున్న దబ్బాకుపల్లెను వురవరమునందు
వెలయు మరుత్పుత్రు వినుతించి శాలివాహనశకమున మతంగాంతరిక్ష

హస్తిశశిసంఖ్యనడువతటస్థమైన పార్థివాబ్దంబునందు సంభ్రమముతోడ
సకలతత్వార్థదర్పణసౌఙనొప్పు శాస్త్ర్రమును జెప్పబూనితి శౌరికృపను.


మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: