Jump to content

సకలేష్‌పూర్

అక్షాంశ రేఖాంశాలు: 12°53′35″N 75°43′30″E / 12.893°N 75.725°E / 12.893; 75.725
వికీపీడియా నుండి
సకలేష్‌పూర్
హిల్ స్టేషన్
సకలేష్‌పూర్ ప్రకృతి దృశ్యం
సకలేష్‌పూర్ ప్రకృతి దృశ్యం
Nickname: 
కర్ణాటక స్విట్జర్లాండ్[1][2]
సకలేష్‌పూర్ is located in Karnataka
సకలేష్‌పూర్
సకలేష్‌పూర్
కర్ణాటకలోని సకలేష్‌పూర్
Coordinates: 12°53′35″N 75°43′30″E / 12.893°N 75.725°E / 12.893; 75.725
దేశంభారతదేశం  India
రాష్ట్రంకర్ణాటక
జిల్లాహసన్
రీజియన్మలెనాడు
Elevation
956 మీ (3,136 అ.)
జనాభా
 (2011)
 • Total23,352[3]
Demonymభాషలు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
573134
Telephone code+91–8173
Vehicle registrationKA-46
లింగ నిష్పత్తి100:80 /

సకలేష్‌పూర్ లేదా సక్లేషపుర భారతదేశం, కర్ణాటక రాష్ట్రం, హసన్ జిల్లా, సకలేష్‌పూర్ తాలూకాకి చెందిన గ్రామం.

పంటలు

[మార్చు]

ఈ గ్రామం పశ్చిమ కనుమలలోని జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లోని కొండ ప్రాంతంలో ఉంది. ఇక్కడ కాఫీ, ఏలకులు, మిరియాలు, కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి. ఈ పంటలు సకలేష్‌పూర్ ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా దోహదపడతాయి.[4]  

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[5] 23,352 జనాభా ఉంది,[6] అందులో 11,558 మంది పురుషులు, 11,794 మంది స్త్రీలు ఉన్నారు. సకలేష్‌పూర్ సగటు అక్షరాస్యత రేటు 88.47%: పురుషుల అక్షరాస్యత 92.72%, స్త్రీల అక్షరాస్యత 84.31%.

జీవవైవిధ్యం

[మార్చు]

సకలేష్‌పూర్ పశ్చిమ కనుమలలో ఉంది, ఇది కేరళ నుండి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న పర్వత శ్రేణి. బిస్లే రిజర్వ్ ఫారెస్ట్‌ను కలిగి ఉన్నసకలేష్‌పూర్ చుట్టూ ఉన్న దక్షిణ శ్రేణి ప్రపంచంలోని 18 బయో-డైవర్సిటీ హాట్‌స్పాట్‌లలో ఒకటిగా జాబితా చేయబడింది.[7] [8]సకలేష్‌పూర్‌లోని స్థానిక వృక్షజాలంలో ఎర్రటి-నారింజ రంగు పగోడా పుష్పం ( క్లెరోడెండ్రమ్ పానిక్యులాటం ), స్థానికంగా రక్తపుష్ప్ ఎ (రక్త పుష్పం) అని పిలుస్తారు.[9]

భౌగోళికం

[మార్చు]

ఈ గ్రామం సముద్ర మట్టానికి 932 మీ (3,058 అడుగులు) ఎత్తులో ఉంది. సకలేష్‌పూర్ తాలూకాకు ఈశాన్యంలో బేలూర్ తాలూకా, తూర్పున ఆలూర్ తాలూకా, పశ్చిమాన దక్షిణ కన్నడ జిల్లా, వాయువ్యంలో చిక్కమగళూరు జిల్లా, ఆగ్నేయ, దక్షిణాన కొడగు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమ కనుమల పర్వతాలు తాలూకా పశ్చిమ అంచున విస్తరించి, దక్షిణ కన్నడ జిల్లా నుండి సకలేష్‌పూర్‌ను వేరు చేస్తాయి. మిగిలిన జిల్లా దక్కన్ పీఠభూమిలో ఉంది. కావేరి ఉపనది అయిన హేమావతి నది ఈ గ్రామానికి తూర్పున ప్రవహిస్తుంది, ఇది చిక్కమగళూరు జిల్లాలో ఉద్భవించి సకలేష్‌పూర్ పట్టణం గుండా ప్రవహిస్తుంది.[10]

మంజరాబాద్ కోట

[మార్చు]

మంజరాబాద్ కోటను టిప్పు సుల్తాన్ నిర్మించాడు.[11] ఇది ఎన్హెచ్- 75లో సకలేష్‌పూర్ శివార్లలో ఉంది. ఇది మంగళూరుకు వెళ్లే రహదారికి ఎదురుగా ఉన్న కొండపై 8-కోణాల నక్షత్ర ఆకారంలో ఉంటుంది. [12]ఇక్కడ  శ్రీరంగపట్టణానికి వెళ్ళడానికి సొరంగం మార్గం కూడా ఉంటుంది. [13]ఈ కోటను పురావస్తు శాఖ నిర్వహిస్తోంది.[9]

మూలాలు

[మార్చు]
  1. "Sunday story: Misty Manjarabad – Where Glinting swords clashed for a slice of glory". Deccan Chronicle. 23 July 2017. Retrieved 16 December 2017.
  2. "Cardamom, coffee & more". Deccan Herald. 9 September 2014. Retrieved 16 December 2017.
  3. "Sakleshpur Population Census 2011". census2011.co.in. Retrieved 20 March 2017.
  4. "Distance between Mangalore and Sakleshpur". All Distance Between. Retrieved 17 June 2018.
  5. "The Census 2011 is the 15th National census survey conducted by the Census Organization of India". Census Commission of India.
  6. "Sakleshpur Urban & Rural Population". Census India. Retrieved 12 December 2019.
  7. Rupa Sriram (9 August 2017). "Monsoon in Sakleshpur". Deccan Herald. Retrieved 12 December 2019.
  8. "Bisle Ghat road awaits repair". Deccan Herald. 3 July 2014. Retrieved 12 December 2019.
  9. 9.0 9.1 Rao, Bindu Gopal (9 September 2014). "Cardamom, coffee & more". Retrieved 16 January 2015.
  10. "After a lull, rains lash Malnad region". The Hindu. 5 September 2019. Retrieved 12 December 2019.
  11. "History of Manjarabad". Hassan District Administration Official website. Retrieved 29 August 2021.
  12. Arun Uppinangady (20 August 2011). "Beltangady: Tipu Sultan's Manjrabad Fort Lies in Shambles". Daijiworld. Retrieved 12 December 2019.
  13. Babu Thekkaraj (17 January 2018). "Past turns perfect in Bisle Ghat". Deccan Herald. Retrieved 6 March 2020.